English | Telugu

అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేస్తా


భానుశ్రీ బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తూ అలరిస్తూ ఉంటుంది. బాహుబలి మూవీలో తమన్నాతో కలిసి చేసింది. బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా వెళ్ళింది. అలాంటి భానుశ్రీ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకి వచ్చింది. భానుశ్రీకి స్వయంవరం పెడితే ఎవరెవరు ఉండాలనుకుంటుంది అంటూ హోస్ట్ అడిగేసరికి ఎవరైనా ఉండొచ్చా అంది..ఎవరైనా అంది హోస్ట్. బిగ్ స్క్రీన్ మీద రణ్వీర్ కపూర్, విజయ్ దేవరకొండ అని చెప్పేసరికి టీవీలో చెప్పు అంది. "టీవీలో అంత అందగాళ్ళు లేరే..నా పక్కన నిలబడేంత స్టేటస్ ఉన్నవాళ్లు ఎవరూ లేరు. " అంది భాను. "టీవీలో మా హైపర్ ఆది ఎంత అందంగా ఉంటాడు" అంది హోస్ట్. "నా కటౌట్ నా హాట్ చూసి మాట్లాడు" అంది భాను. "నిఖిల్ ఉన్నాడు" అని హోస్ట్ అంది. 'ఆయనకు లాస్ట్ టైం బ్రేకప్ అయ్యిందట" అని భాను చెప్పింది.

"ఇలాంటి టైంలోనే మనం వెళ్లి హెల్ప్ చేయాలి" అంది హోస్ట్. "వద్దురా నేను బ్రేకప్ దానిలోకి వెళ్లి ప్యాచప్ కాలేను..నాకంటూ ఒక స్పెషల్ పీస్ కావాలి " అని చెప్పింది భాను. "అర్జున్ కి పెళ్లయిపోయింది. పృద్వి వద్దు..ఆల్రెడీ అతని వెనక విష్ణు ప్రియా పడుతోంది. కష్టం నేను అలా ఎవరి వెనకాల పడను. నా వెనకాల పడేవాళ్ళు కావాలి నాకు. అందుకే చెప్పా టీవీలో నాకు సూటయ్యేవాళ్ళు లేరని" అంది భాను. "మరి అల్లు అర్జున్" అని హోస్ట్ అడిగింది. "అల్లు అర్జున్ ఫాన్స్ అసోసియేషన్ ఇక్కడ. అల్లు అర్జున్ కి నేనంటే ఎంతిష్టమో తెలుసా నీకు . పుష్ప మూవీలో శ్రీవల్లి కదా వెళ్లి తీసేసి శ్రీ అందుకే నా పేరులోని శ్రీ తీసి పెట్టమని ఆయనే చెప్పారు" అంది భాను. ఇక హోస్ట్ వర్ష ఐతే "నాకు అల్లు అర్జున్ రోజూ కల్లోకి వస్తాడు.." అని చెప్పేసరికి "మేము రోజు కలుస్తాం..ఇంకో జన్మ ఉంటే అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేస్తా " అని ఇంకొంచెం ఎక్కువగా చెప్పింది భాను.

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.