English | Telugu

Karthika Deepam2 :  త్వరలో కార్తీక్, దీపల శోభనం.. నోరెళ్ళబెట్టిన అనసూయ!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -387 లో... సుమిత్ర గురించి కాంచన మాట్లాడుతుంది. అమ్మ ఎంత మొండిది. అయినా నేను వదలను.. ఈ రోజు అమ్మతో భోజనం తినిపిస్తానని దీప అనగానే సుమిత్రని పట్టుకొని అమ్మ అంటుందని కాంచన వాళ్ళు షాక్ అవుతారు. అమ్మగారు అనబోయి అలా అందని కార్తీక్ కవర్ చేస్తాడు. అంటే మాత్రం తప్పేంటి అనసూయ గారు అని కార్తీక్ అంటాడు. మిమ్మల్ని కూడా అలా పిలవడం నాకు ఇష్టం లేదు చక్కగా పెద్దమ్మ అంటానని కార్తీక్ అనగానే అనసూయ హ్యాపీగా ఫీల్ అవుతుంది.

సుమిత్ర అత్తని అమ్మ అని పిలవడానికి ఇంకా టైమ్ ఉందని కార్తీక్ అనగానే మీరనేది అర్ధం కావడం లేదని అనసూయ అంటుంది. అంటే రెండు కుటుంబాలు కలిసాక సుమిత్ర అత్తని దీప అమ్మ అంటుందని కార్తీక్ కవర్ చేస్తాడు. ఆ తర్వాత కార్తీక్, దీప సైకిల్ పై శివన్నారాయణ ఇంటికి బయల్దేర్తారు. ఇద్దరు సరదాగా కబుర్లు చెప్తూ వెళ్తారు. ఆ తర్వాత కార్తీక్, దీప శివన్నారాయణ దగ్గరికి వెళ్లి నమస్కారం పెడతారు. ఎప్పుడు కార్తీక్ మిమ్మల్ని అందరు అలా పిలుస్తూ.. నన్ను మాత్రం పారు అంటున్నాడని శివన్నారాయణకి పారిజాతం చెప్తూ మురిసిపోతుంది. ఏమైనా అంటే మనం మనం ఒకటి అంటున్నాడని అంటుంది.

నీకు ఇంకా అర్థం కాలేదా.. మనం మనం ఒకటి అంటే నువ్వు కూడా ఈ ఇంటికి ఒకప్పుడు పనిమనిషివి కదా.. ఇప్పుడు వాళ్ళు కూడా అదేగా అని శివన్నారాయణ అనగానే పారిజాతం మొహం మాడిపోతుంది. ఆ తర్వాత దీప దగ్గరికి శౌర్య వస్తుంది. సుమిత్ర దగ్గరికి దీప వెళ్లి.. అమ్మగారు మీరు భోజనం చెయ్యలేదని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.