English | Telugu
Karthika Deepam2 : పందెంలో గెలిచిన కార్తీక్.. జ్యోత్స్నకి డౌట్!
Updated : Jun 21, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -389 లో..... కార్తీక్ కావాలనే సుమిత్రని రెచ్చగొట్టి తను భోజనం చేసేలా చేస్తాడు. నేను దీప వంటలు తిన్నాను. ఇప్పుడు ఏమైంది నేను మారిపోయానా ఆ మనిషి మీద ఎప్పటికి కోపం పోదు.. ఆ మనిషి నా దృష్టిలో హంతకురాలు అని సుమిత్ర అనగానే.. దీప బాధపడుతుంది. ఆ తర్వాత వంటలు బాగున్నాయ్.. నా భార్య తినేలా చేసినందుకు థాంక్స్ అని దీప, కార్తీక్ లకి చెప్తాడు దశరథ్. వంటలు వరస్ట్ గా ఉన్నాయని జ్యోత్స్న అంటుంది.
ఆ తర్వాత దీప, కార్తీక్ ఇద్దరు పారిజాతం, జ్యోత్స్నల దగ్గర కి వెళ్లి మన పందెం ప్రకారం ఇప్పుడు నువ్వు గుంజీలు తియ్యాలి.. లేదంటే పెద్ద వాళ్ళకి చెప్తానని కార్తీక్ అనగానే భయపడి జ్యోత్స్న కార్తీక్ స్టాప్ అనేవరకు తీస్తుంది. ఆ తర్వాత దీప, కార్తీక్ ఇంటికి వెళ్తారు. అత్త భోజనం చేసిందని కార్తీక్ చెప్పగానే.. కాంచన హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందరు సరదాగా కాసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత జ్యోత్స్న కాళ్ళకి మసాజ్ చేస్తుంది పారిజాతం.
నిన్ను వాడితో పెట్టుకోకు అంటే వినవని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. నేను అసలు అయిన వారసురాలు కాదని బావకి తెలిసి ఉంటుందా అని జ్యోత్స్న అంటుంది. లేదు దాస్ చెప్పడు.. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో కానీ నీకు మాత్రం అన్యాయం జరగనివ్వను అవసరమైతే ఈ ఇంట్లో వాళ్ళ ప్రాణాలు తియ్యడానికి అయినా రెడీ అని పారిజాతం అనగానే..వజ్యోత్స్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు దీపకి కార్తీక్ విజిల్ వెయ్యడం నేర్పిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.