English | Telugu

‘రావు బహదూర్‌’ ఫస్ట్‌లుక్‌.. గుర్తు పట్టలేనంతగా మారిపోయిన హీరో!

కేరాఫ్‌ కంచరపాలెం వంటి డీసెంట్‌ హిట్‌ చిత్రాన్ని రూపొందించిన వెంకటేశ్‌ మహా దర్శకత్వంలో రాబోతున్న మరో విభిన్న చిత్రం ‘రావు బహదూర్‌’. సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.‘అనుమానం పెనుభూతం’’ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ పోస్టర్‌లో సత్యదేవ్‌ ఓల్డ్‌ గెటప్‌లో కనిపిస్తూ అందర్నీ షాక్‌కి గురి చేస్తున్నాడు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో, శ్రీచక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, అప్లాజ్‌ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తునరీ చిత్రాన్ని వచ్చే సమ్మర్‌లో రిలీజ్‌ చేయబోతున్నారు. కేరాఫ్‌ కంచరపాలెం చిత్రం తర్వాత వెంకటేష్‌ మహా రూపొందించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రంలో కూడా సత్యదేవ్‌ హీరోగా నటించారు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న నటుల్లో సత్యదేవ్‌కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తను చేసే సినిమాలు విభిన్నంగా ఉండడమే కాకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల వచ్చిన విజయ్‌ దేవరకొండ సినిమా కింగ్డమ్‌లో ఓ కీలక పాత్రలో నటించి అందర్నీ మెప్పించారు. అలాగే సత్యదేవ్‌ నటించిన అరేబియా కడలి వెబ్‌ సిరీస్‌ కూడా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇప్పుడు వెంకటేష్‌ మహా దర్శకత్వంలో రూపొందుతున్న ‘రావు బహదూర్‌’ తనకు హీరోగా బ్రేక్‌ ఇస్తుందని నమ్ముతున్నారు. ఇందులో ఓల్డ్‌ గెటప్‌లో ఉన్న ఓ జమీందారుగా సత్యదేవ్‌ ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తున్నారని అర్థమవుతోంది. డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌తో సినిమాలు రూపొందించే వెంకటేష్‌ ఈ సినిమాలో కూడా ఏదో సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.