English | Telugu

ఎంతకు తెగించార్రా.. డబ్బులిచ్చి ట్రోలింగ్‌ చేయిస్తున్నారట!

ఒకరు బాగుపడి ఉన్నత స్థాయికి వెళుతున్నారంటే ఓర్వలేని వాళ్ళు, కిందకు లాగెయ్యాలని ట్రై చేసే వాళ్ళు ఏ రంగంలోనైనా ఉంటారు. అలాగే సినిమా రంగంలో కూడా కొందరిలో ఈ ధోరణి కనిపిస్తుంది. అయితే బయటికి నవ్వుతూ పలకరించుకున్నా లోపల మాత్రం వారు నాశనం అవ్వాలని కోరుకుంటారు. నేషనల్‌ క్రష్‌గా పేరు తెచ్చుకొని వరస విజయాలతో దూసుకెళ్తున్న రష్మిక మందన్న విషయంలో ఇదే జరుగుతోందని తెలుస్తోంది. పుష్ప, యానిమల్‌, పుష్ప2, ఛావా, కుబేర వంటి స్టార్స్‌ సినిమాల్లో నటించి హీరోయిన్‌గా దూసుకెళ్తున్న రష్మిక కొందరు పనిగట్టుకొని ట్రోలింగ్‌ చేస్తున్నారు.

తనపై జరుగుతున్న ట్రోలింగ్‌ గురించి ఒక ఇంటర్వ్యూలో స్పందించారు రష్మిక మందన్న. ‘సోషల్‌ మీడియాలో నన్ను టార్గెట్‌ చేస్తూ కొందరు ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఇది నేచురల్‌గా నెటిజన్లు చేసే ట్రోలింగ్‌ కాదు. నన్ను అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు కావాలనే ఇదంతా చేస్తున్నారు. అలా ట్రోల్‌ చేసినందుకు డబ్బులు కూడా ఇస్తున్నారు. నన్నెందుకు టార్గెట్‌ చేస్తున్నారో అర్థం కావడం లేదు. నేనంటే కొందరికి ఇష్టం ఉండకపోవచ్చు. అందరికీ నేను నచ్చాలని లేదు. అది నాకూ తెలుసు. కానీ, ఇలాంటి పనులు చేయడం కరెక్ట్‌ కాదు. టాలెంట్‌ ఉన్నవారిని, హార్డ్‌ వర్క్‌ చేసేవారిని ఎవరూ ఆపలేరు’ అన్నారు.

రష్మిక చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా సోషల్‌ మీడియా అలర్ట్‌ అయిపోయింది. దీని గురించే నెటిజన్లు బాగా డిస్కస్‌ చేస్తున్నారు. ఈ విషయంలో చాలా మంది రష్మికను సపోర్ట్‌ చేస్తున్నారు. కొందరు మాత్రం అలా ట్రోల్‌ చెయ్యడానికి ఆమె ప్రవర్తనే కారణం అంటున్నారు. మరికొందరు మిమ్మల్ని ఎవరూ ఆపలేరు, ధైర్యంగా ముందుకు వెళ్ళండి అని ధైర్యం చెబుతున్నారు.