జాక్ పాట్ కొట్టిన నాని డైరెక్టర్.. ఏకంగా సూపర్ స్టార్ తో..!
'మెంటల్ మదిలో' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వివేక్ ఆత్రేయ (Vivek Athreya).. 'బ్రోచేవారెవరురా', 'అంటే సుందరానికీ', 'సరిపోదా శనివారం' వంటి సినిమాలతో ఆకట్టుకొని ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. తన మొదటి రెండు సినిమాలను శ్రీవిష్ణుతో, ఆ తర్వాత రెండు సినిమాలను నానితో చేసిన వివేక్.. తన ఐదో సినిమా కోసం ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ ని డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.