English | Telugu

రాజమౌళి తర్వాత మహేష్‌తో సినిమా చేసే డైరెక్టర్‌ ఎవరో తెలుసా?

రాజమౌళి తర్వాత మహేష్‌తో సినిమా చేసే డైరెక్టర్‌ ఎవరో తెలుసా?

రాజమౌళితో సినిమా అంటే హీరోలు కొన్ని సంవత్సరాలపాటు అతని కాంపౌండ్‌లో ఉండిపోవాల్సిందే. ఇప్పటివరకు ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అలా రాజమౌళితో ఎక్కువ కాలం ట్రావెల్‌ అయినవాళ్ళే. ప్రస్తుతం మహేష్‌బాబు 29వ సినిమా రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న విషయం తెలిసిందే. రాజమౌళి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా వాటి కంటే తక్కువ సమయంలోనే పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత మహేష్‌ చేసే సినిమా ఏమిటి అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో ‘పెద్ది’ వంటి డిఫరెంట్‌ మూవీని తెరకెక్కిస్తున్న బుచ్చిబాబు సానా.. తన నెక్స్‌ట్‌ మూవీ మహేష్‌తో చేయబోతున్నట్టు సమాచారం. ‘పెద్ది’ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేశారు. మహేష్‌, రాజమౌళి సినిమా షూటింగ్‌ దశలో ఉంది. ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఎడ్వంచరస్‌ మూవీ ఇది. ఈ సినిమా 2027లో రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది. 

సుకుమార్‌ దర్శకత్వంలో మహేష్‌ చేసిన ‘1 నేనొక్కడినే’ చిత్రానికి డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు బుచ్చిబాబు. ఆ సమయంలోనే మహేష్‌తో మంచి ర్యాపో ఏర్పడిరది. డైరెక్టర్‌గా బుచ్చిబాబు చేసిన తొలి సినిమా ‘ఉప్పెన’ మహేష్‌కి బాగా నచ్చింది. ఆ సినిమా చూసి అతన్ని అప్రిషియేట్‌ చేశారు కూడా. చాలా సందర్భాల్లో వీరిద్దరూ కలుసుకున్నారు. మంచి సబ్జెక్ట్‌ ఉంటే చెప్పమని బుచ్చిబాబును అడిగారు మహేష్‌. అప్పటి నుంచి మహేష్‌ కోసం బుచ్చిబాబు ఒక కథ సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. మహేష్‌ని ఒక రేంజ్‌లో, కొత్తగా చూపించేందుకు బుచ్చిబాబు కసరత్తు చేస్తున్నాడట. మహేష్‌తో సినిమా చెయ్యడానికి ఇంకా చాలా టైమ్‌ ఉండడంతో కథ విషయంలో ఎంతో కేర్‌ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ‘ఉప్పెన’ తర్వాత చేస్తున్న ‘పెద్ది’ చిత్రంలో రామ్‌చరణ్‌ గెటప్‌ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఒక కొత్త లుక్‌లో కనిపిస్తున్న చరణ్‌తో మరో పెద్ద హిట్‌ కొట్టబోతున్నాడని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

ప్రస్తుతం రాజమౌళితో మహేష్‌ చేస్తున్న సినిమా పూర్తి కావడానికి చాలా టైమ్‌ పడుతుంది. అప్పటి ‘పెద్ది’ కూడా రిలీజ్‌ అయిపోతుంది. ఆ తర్వాత తన పూర్తి కాన్‌సన్‌ట్రేషన్‌ మహేష్‌ సినిమాపైనే పెట్టాలని బుచ్చిబాబు డిసైడ్‌ అయ్యాడట. అయితే ఇప్పుడు సమస్య ఏమిటంటే.. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఎలాంటి సినిమా చెయ్యాలి, ఎలాంటి కథతో చెయ్యాలి అనే విషయంలో హీరోలంతా కన్‌ఫ్యూజన్‌లోనే ఉంటారు. రాజమౌళితో చేసే సినిమా తప్పకుండా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది. ఆ తర్వాత చేసే సినిమా విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఇప్పటి నుంచే బుచ్చిబాబు కథ సిద్ధం చేస్తున్నాడు. మహేష్‌ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత అతని మైండ్‌ సెట్‌ ఎలా ఉంటుందో, ఆడియన్స్‌లో ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయో ఇప్పుడే చెప్పడం కష్టం. అయినప్పటికీ బుచ్చిబాబు లాంటి కొత్త డైరెక్టర్‌ నుంచి డెఫినెట్‌గా కొత్త తరహా కథ వస్తుందనే నమ్మకం మహేష్‌కి ఉంది. అందుకే అతనితో సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ‘పెద్ది’, మహేష్‌, రాజమౌళి సినిమాలు ఎంతటి విజయం సాధిస్తాయో, ఎలాంటి రికార్డులు సృష్టిస్తాయో దాన్ని బట్టే మహేష్‌, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చే సినిమాకి ఒక పూర్తి లుక్‌ వచ్చే అవకాశం ఉంది.