అమ్మమీద ఒట్టేసి అబద్ధం చెప్పాడు! ముగ్గురికి సారీ చెప్పాడు!!
గత వారం తాను చేసిన తప్పుకు యాంకర్ రవి ముగ్గురు మహిళకు సారీ చెప్పాడు. ఒకరు... లహరి. రెండు... ప్రియ. మూడు... తన తల్లి. ఇంతకీ, అతను చేసిన తప్పేమిటి? ఎందుకు? అని అంటే... 'బిగ్ బాస్'లో రవి, ప్రియ, లహరి మధ్య గత వారం జరిగిన విషయం గేమ్ షోను ఫాలో అవుతున్న వాళ్ళకు తెలిసే ఉంటుంది. షో నుండి బయటకు వెళ్లిన తర్వాత లహరి యాంకరింగ్ చేయాలని అనుకుంటుందని, అందుకే తనతో సన్నిహితంగా ఉంటుందని ప్రియతో రవి చెప్పాడు.