English | Telugu

ఆగస్టు 18.. ప్రభాస్ వర్సెస్ ధనుష్

రీ రిలీజ్ సినిమాలతో రెబల్ స్టార్ ప్రభాస్, కోలీవుడ్ స్టార్ ధనుష్ బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. ప్రభాస్ ఫ్లాప్ మూవీ 'యోగి', ధనుష్ హిట్ మూవీ 'రఘువరన్ బి.టెక్' ఈ ఆగస్టు 18న రీరిలీజ్ అవుతున్నాయి.

టాలీవుడ్ లో కొంతకాలంగా రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. పలు సినిమాలు రీరిలీజ్ లోనూ మంచి వసూళ్లతో సత్తా చాటుతున్నాయి. అయితే ప్రభాస్ కెరీర్ లో పలు హిట్ సినిమాలు ఉండగా.. 'యోగి' వంటి ఫ్లాప్ సినిమాని రీరిలీజ్ చేస్తుండటం ఫ్యాన్స్ కి నిరాశ కలిగిస్తోంది. ప్రభాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన 'యోగి' మంచి అంచనాలతో 2007 లో విడుదలై నిరాశపరిచింది. 16 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ థియేటర్లలో సందడి చేయనుంది. మరి రీరిలీజ్ లో అయినా ఈ సినిమాని ప్రభాస్ ఫ్యాన్స్ ఆదరిస్తారో లేక లైట్ తీసుకుంటారో చూడాలి.

తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా రీరిలీజ్ లో సత్తా చాటుతున్నాయి. ఇటీవల 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' మంచి వసూళ్లు రాబట్టింది. 'రఘువరన్ బి.టెక్' కూడా అలాంటి మ్యాజిక్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. ధనుష్ తమిళ చిత్రం 'వేలై ఇళ్ళ పట్టదారి'.. తెలుగులో 'రఘువరన్ బి.టెక్' పేరుతో 2015, జనవరి 1న విడుదలై తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. యూత్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. ఎనిమిదేళ్లకే ఇప్పుడు ఈ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. రీ రిలీజ్ సినిమాలతో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న ప్రభాస్, ధనుష్ ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.