English | Telugu
ఈయన చిరుకోసం సిద్దం చేస్తున్నాడట
Updated : Jan 1, 2014
"నరసింహ నాయుడు", "ఇంద్ర", "గంగోత్రి" వంటి హిట్ చిత్రాలకు కథను అందించిన రచయిత చిన్నికృష్ణ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తన భవిష్యత్తు ప్రణాళికలను వివరిస్తూ... "చిరంజీవి గారి 150వ చిత్రం కోసం అధ్బుతమైన కథ సిద్దం చేస్తున్నాను. అదే విధంగా అమీర్ ఖాన్ కోసం కూడా నాలుగేళ్ళుగా ఓ మంచి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాను. ప్రస్తుతం నా దగ్గర పది స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఐదు స్క్రిప్టులు నేనే డైరెక్ట్ చేసుకుంటాను. మిగిలినవి వేరే దర్శకులకు ఇస్తాను. త్వరలోనే మెగాఫోన్ పట్టబోతున్నాను" అని అన్నారు.