English | Telugu

మహేష్ థియేటర్లలో నాగ్ ఫ్యామిలీ

సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన "1" చిత్రం ఈనెల 10వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయిన ఈ చిత్రాన్ని తమ ప్రమోషన్ కోసం ఉపయోగించుకోవాలని "మనం" చిత్ర యూనిట్ భావిస్తుంది. అక్కినేని ఫ్యామిలీ కలిసి నటిస్తున్న "మనం" చిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్ ను మహేష్ "1" చిత్రం విడుదలయ్యే ప్రతి థియేటర్లలో ప్రదర్శించనున్నారు.ఇలా చేయడం వలన "మనం" కు భారీ ప్రమోషన్ దొరుకుతుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. "మనం" చిత్రాన్ని వేసవి సెలవుల్లో విడుదల చేయనున్నారు.