English | Telugu
వార్ 2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లేస్ అదేనా!
Updated : Jul 22, 2025
మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr) అప్ కమింగ్ మూవీ 'వార్ 2'(War 2). బాలీవుడ్ అగ్ర హీరో 'హృతిక్ రోషన్(Hrithik Roshan)ఎన్టీఆర్ కలిసి ఈ చిత్రంలో నటించారు. దీంతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కుతున్న అతి పెద్ద మల్టీస్టారర్ లో ఒకటిగా 'వార్ 2 ' ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకుంది. పాన్ ఇండియా హిట్ 'దేవర'(Devara)తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావడం, బాలీవుడ్ లో తొలిసారి అడుగుపెడుతుండటంతో 'వార్ 2 'లో ఎన్టీఆర్ పెర్ ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందనే క్యూరియాసిటీ అందరిలో ఉంది.
'వార్ 2 ' అగస్ట్ 14 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రమోషన్స్ లో వేగం పెరగనుంది. ఈ మేరకు తెలుగు రిలీజ్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ(VIjayawada)లో ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ బాధ్యతలని ఎన్టీఆర్ తీసుకోవడంతో పాటు, హృతిక్ రోషన్ కూడా ఈవెంట్ కి వస్తాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఆగస్టు రెండో వారంలో నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి
.
వార్ 2 లో కియారా అద్వానీ(Kiara Advani)హీరోయిన్‌గా చేస్తుండగా, అశుతోష్ రానా, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ వ్యయంతో నిర్మించగా అయాన్ ముఖర్జీ(Ayan Mukerji)దర్శకత్వం వహించాడు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ తెలుగులో రిలీజ్ చేస్తుండగా ఎన్టీఆర్ 'రా ఏజెంట్' గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 25 న ట్రైలర్ రిలీజ్ కానుంది.