English | Telugu
బాలకృష్ణతో హిట్ కొట్టాలంటే ఏ డైరెక్టరైనా బోయపాటిని ఫాలో అవ్వాల్సిందే!
Updated : Nov 4, 2023
నటసింహ నందమూరి బాలకృష్ణతో సినిమా చెయ్యడం అంటే మామూలు విషయం కాదు. అతని ఇమేజ్‌కి తగిన కథ, పవర్‌ఫుల్ డైలాగ్స్, థ్రిల్లింగ్ యాక్షన్ ఎపిసోడ్స్.. అన్నీ ఉంటేనే బాలకృష్ణ సినిమా అవుతుంది. ఇవన్నీ పక్కాగా సిద్ధం చేసుకున్న ఏ డైరెక్టర్ అయినా బాలకృష్ణతో సూపర్‌హిట్ కొట్టాలంటే బోయపాటి శ్రీనుని ఫాలో అవ్వాల్సిందే. అదేమిటి.. బోయపాటిని ఎందుకు ఫాలో అవ్వాలి అనే డౌట్ మీకు రావచ్చు. దానికి ఇక్కడ ఓ కథ ఉంది.
అదేమిటంటే.. నందమూరి బాలకృష్ణ చేసిన సినిమాలను గమనిస్తే ఒక్కో సినిమాలో ఒక్కో గెటప్‌తో కనిపిస్తారు. అయితే విగ్గు విషయంలో మాత్రం చాలా మంది డైరెక్టర్లకు ఒక కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఏ టైప్ విగ్గు అయితే బాలయ్యకు సూట్ అవుతుంది అనే దానిపై ఒక నిర్ణయానికి రాలేరు. రజనీకాంత్‌లాంటి హీరోకి సెట్ అయినంత ఈజీగా బాలకృష్ణకు విగ్గు సెట్ అవ్వదు. ఇది చాలా సినిమాల్లో మనం గమనించాం. అయితే బాలకృష్ణతో సింహా, లెజెండ్, అఖండ వంటి బ్లాక్‌బస్టర్స్‌ని ఇచ్చిన బోయపాటి శ్రీనుకి మాత్రం ఈ విషయంలో ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదు. ఆ మూడు సినిమాల్లో మూడు డిఫరెంట్ గెటప్స్‌తో కనిపిస్తాడు బాలకృష్ణ. అంటే బాలకృష్ణకు సూట్ అయ్యే విగ్గుని సెలెక్ట్ చేసుకోవడంలో బోయపాటి శ్రీను సక్సెస్ అయ్యాడని చెప్పాలి. బాలకృష్ణకు విగ్ సెట్ అయ్యిందంటే సగం సినిమా సూపర్‌హిట్ అయినట్టేనని బోయపాటికి గట్టి నమ్మకం ఉందని ఈ సినిమాలను బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి వరసగా బాలకృష్ణతో మూడు బ్లాక్‌బస్టర్స్ చేసిన బోయపాటి శ్రీనుని ఫాలో అయితే విగ్ విషయంలో సొల్యూషన్ దొరుకుతుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘భగవంత్ కేసరి’ తర్వాత బాలకృష్ణ చేయబోయే సినిమా సెట్స్‌పైకి వెళ్ళబోతోంది. ఈ సినిమాకి బాబీ దర్శకుడు. బాలకృష్ణ గెటప్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇప్పటికే రకరకాల గెటప్స్‌ని స్కెచ్ వేయించిన బాబీ.. బాలకృష్ణకు ఏ గెటప్‌ని సెలెక్ట్ చేసుకోవాలి అనే దానిపై వర్కవుట్ చేస్తున్నాడట. ఈ విషయంలో బోయపాటిని ఫాలో అయితే బాబీ కూడా బాలకృష్ణతో బాక్‌బస్టర్ కొట్టే అవకాశం ఉంది.