English | Telugu

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నిఖిల్ వీడియో

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డం ని సంపాదించిన హీరోల్లో నిఖిల్ సిద్దార్ధ కూడా ఒకడు. 2007 లో వచ్చిన హ్యాపీ డేస్ సినిమా ద్వారా పరిచయమైన నిఖిల్ ఆ తర్వాత పది సినిమాలకి పైగా చేసినా కూడా పొందని గుర్తింపుని 2022 లో వచ్చిన కార్తికేయ 2 ద్వారా పొందాడు.ఏకంగా కార్తికేయ 2 తో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. లేటెస్ట్ గా నిఖిల్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న తాజా మూవీ స్వయం భు. పీరియాడిక్ కథతో తెరకెక్కుతున్న ఈ మూవీలో యుద్దవిన్యాసాలు భారీగానే ఉండబోతున్నాయి. తాజాగా ఈ మూవీలోని తన క్యారక్టర్ దృష్ట్యా నిఖిల్ కత్తి విన్యాసాలని నేర్చుకుంటున్నాడు. చేతిలో కత్తి ఉందా లేదా అనే రీతిలో ఎడం చేత్తో నిఖిల్ చేసే విన్యాసాలకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ని షేక్ చేస్తుంది. ఆ వీడియో చూసిన వాళ్ళందరు నిఖిల్ కి సినిమా మీద ఉన్న కమిట్ మెంట్ ఎలాంటిదో అర్ధం చేసుకొని నిఖిల్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.
నిఖిల్ కూడా కార్తికేయ 2 సినిమా నుంచి తన కెరీర్ మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు. స్పై ఇచ్చిన పరాజయంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇటీవలే అట్టహాసంగా ప్రారంభం అయిన స్వయంభు మూవీలో నిఖిల్ సరసన హిట్ చిత్రాల కథానాయిక సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తుంది. ఠాగూర్ మధు నిర్మాతగా వ్యవహరిస్తుండగా భరత్ కృష్ణమాచార్య దర్శత్వం వహిస్తున్నాడు. నిఖిల్ అభిమానులతో పాటు సినీ అభిమానుల్లో కూడా స్వయం భు సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. రవి బర్సుర్ సంగీతాన్ని అందిస్తున్నాడు