English | Telugu

న్యూ హెయిర్ స్టైల్ లో రెమో

విక్రమ్ అనగానే గుర్తొచ్చేది పెద్ద హెయిర్ స్టైల్. విక్రమ్ నటించిన రెమో, అపరిచితుడు, మల్లన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. అంతటి ఇమేజ్ సంపాదించుకున్న నటుడు విక్రమ్. అలాంటి విక్రమ్ ఇపుడు హెయిర్ స్టైల్ లేకుండా గుండుతో దర్శనమిచ్చాడు. భారతీయ సినీ పరిశ్రమ వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా చెన్నైలో వందేళ్ళ భారతీయ సినిమా వేడుకలు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ వేడుకకు హాజరయిన విక్రమ్ గుండుతో కనిపించాడు.