English | Telugu

పవన్ కోసం ఏకమైన టాలీవుడ్

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "అత్తారింటికి దారేది" చిత్రం అక్టోబర్ 9వ తేదీన విడుదల కావలసి ఉంది. అయితే ఈ చిత్రాన్ని విడుదలకు ముందే లీక్ చేసేసారు. దీంతో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర పైరసీపై టాలీవుడ్ మొత్తం ఏకమై ఈ సినిమాకు మద్దతుగా నిలిచారు. ప్రేక్షకులు కూడా తమ ఇతర హీరో, తమ హీరో అనే భావన లేకుండా ఈ పైరసీపై పవన్ కు అండగా నిలుస్తున్నారు. భారీ అంచనాలతో విడుదలవుతున్నఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా, బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.