English | Telugu

లేడి విలన్ గా పవన్ పిల్ల

"పిల్లా నువ్వులేని జీవితం" అనే విధంగా పవన్ కళ్యాణ్ "గబ్బర్ సింగ్" చిత్రంలో తెలుగు అమ్మాయిలాగా కనిపించి, అందరి మనసు కొల్లగొట్టిన శృతిహాసన్ త్వరలోనే లేడి విలన్ గా మన ముందుకు రాబోతుంది. జూనియర్ ఎన్టీయార్ హీరోగా నటించిన తాజా చిత్రం "రామయ్యా వస్తావయ్యా". ఈ చిత్రంలో శృతిహాసన్ లేడీ విలన్‌గా నటించిందట. ఇందులో ఆమె పాత్ర పేరు అమ్ములు. ఎన్టీఆర్, సమంతల మధ్యలో గొడవలు సృష్టించే పాత్రలో శృతి కనిపిస్తుందని సమాచారం. ఈ పాత్ర పట్ల శృతిహసన్ కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ పాత్రలో శ్రుతి చేయబోయే సందడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం చాలా నమ్మకంతో ఉన్నారు. మరి ఈ చిత్రం శృతిహాసన్ కు ఎలాంటి బ్రేక్ ను ఇస్తుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.