English | Telugu
వచ్చే ఏడాది ఆగస్ట్ 22న రానున్న విజయ్ దేవరకొండ 'లైగర్'
Updated : Dec 16, 2021
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ రూపొందిస్తోన్న పాన్ ఇండియా ఫిల్మ్ 'లైగర్' రిలీజ్ డేట్‌ను నిర్మాతలు అనౌన్స్ చేశారు. 2022 ఆగస్ట్ 25న థియేటర్లలో తెలుగు సహా పలు భాషల్లో ఈ మూవీ విడుదల కానున్నది. ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్స్‌ను డిసెంబర్ 31న రిలీజ్ చేయనున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా 'లైగర్' రూపొందుతోంది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఓ కీలక పాత్రలో కనిపించే ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.
నిజానికి ఈ ఏడాది సెప్టెంబర్ 9న 'లైగర్' రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్‌లో జాప్యం అవడంతో, అందుకు అనుగుణంగా విడుదల వాయిదా పడింది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి అమెరికాలో ఓ షెడ్యూల్ నిర్వహించారు. అందులో మైక్ టైసన్ కూడా పాల్గొన్నాడు.
Also read:అప్పుడు బాలయ్యతో.. ఇప్పుడు తారక్ తో!
ఈరోజు నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ కౌర్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా లైగర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్‌ను షేర్ చేసిన ఆమె, "ఈ పాన్ ఇండియా మూవీ తన రక్తం, చెమట, వినోదాన్ని వెదజల్లేందుకు రెడీ అవుతోంది. 2022 ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది. డిసెంబర్ 31న గ్లిమ్స్‌ను క్యాచ్ చేద్దాం. ఈ కొత్త సంవత్సరం ఆగ్ లగా దేంగే" అంటూ ఆమె రాసుకొచ్చారు.
Also read:యూట్యూబ్‌లో రెచ్చిపోతున్న సమంత "ఊ అంటావా మావా" సాంగ్!
'లైగర్'ను పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఆ క్యారెక్టర్‌ను సాధికారికంగా చేయడం కోసం అతను బాక్సింగ్‌లో తీవ్ర శిక్షణ తీసుకున్నాడు. 'లైగర్' తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో షూటింగ్ జరుపుకుంటోంది. వాటితో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజవుతోంది.