English | Telugu
రాజమౌళితో సినిమా ఎప్పుడని అడిగితే "అప్రస్తుతం" అన్నబాలయ్య!
Updated : Dec 16, 2021
నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించిన 'అఖండ' బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్టయి, ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో బాలయ్య, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి గురువారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆ తర్వాత స్థానిక మీడియాతో మాట్లాడిన బాలయ్య అఖండ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
Also read:దేవుడున్నాడు.. చూద్దాం ఏం జరుగుతుందో!
"తమ సొంత సినిమాగా భావించి కులమతాలు, పార్టీలకు అతీతంగా ఆదరించి, ఇంత ఘనవిజయం సాధించి పెట్టారు. ప్రేక్షక దేవుళ్లందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా." అన్నారు. "రాజమౌళితో సినిమా ఎప్పుడండీ?" అని వరుసగా పలువురు విలేకర్లు అడగగా, వారివంక అలాగే చూస్తూ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయిన బాలయ్య, పక్కనున్న బోయపాటితో "మీరు మాట్లాడండి" అన్నారు. "మౌనం అంగీకారమా?" అని అడిగితే, "అప్రస్తుతం" అని జవాబిచ్చారు బాలయ్య.
Also read:'పుష్ప' కోసం శేషాచలం ఎర్రచందనాన్ని మారేడుమిల్లి అడవుల్లో సృష్టించింది ఈ జంటే!