English | Telugu
ప్రగతి నాగిన్ డ్యాన్స్ ఇచ్చిపడేసిందిగా
Updated : Dec 16, 2021
భాగ్యరాజా నటించి రూపొందించిన చిత్రం `గౌరమ్మా నీ మొగుడెవరమ్మా`. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది ప్రగతి. తొలి సినిమాలో బోల్డ్‌గా కనిపించి అప్పట్లోనే హాట్ టాపిక్ గా నిలిచింది. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించినా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిలైపోయింది. తల్లి , అత్త పాత్రలల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. ఇదిలా వుంటే సోషల్ మీడియాలో ప్రగతి చేసే రచ్చ మామూలుగా వుండటం లేదు.
గతంలో ఈమె గురించి పెద్దగా ఎవరికి తెలియకపోయినా సోషల్ మీడియా పోస్ట్ లతో మరింతగా పాపులర్ అయింది. లాక్ డౌన్ వేళ దళపతి విజయ్ ఫాస్ట్ బీట్ కి డ్యాన్స్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రగతి ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ఆ తరువాత నుంచి వరుస వర్కవుట్ వీడియోలతో ఇన్ స్టాలో సందడి చేయడం మొదలుపెట్టింది.
తాజాగా నాగిన్ డ్యాన్స్ చేస్తూ ప్రగతి పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. వర్కవుట్ లు చేస్తూ జిమ్ లో ప్రగతి చేసిన నాగిన్ డ్యాన్స్ ఓ రేంజ్ లో నెట్టింట వైరల్ గా మారింది. సూపర్ హాట్ సాంగ్ కి ప్రగతి కట్ బనియన్ పై హొయలు పోతూ స్టెప్పులేసిన తీరుకు నెటిజన్స్ కేకో కేక అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఈ వయసులోనూ ప్రగతి ఏ మాత్రం తగ్గడం లేదని, యమ జోష్ తో డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తోందని, ప్రగతి ఆంటీ నాగిన్ డ్యాన్స్ ఇచ్చిపడేసిందిగా అని మరి కొంత మంది అంటున్నారు.