English | Telugu

వెంకటేష్‌ హీరోగా త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో ఫస్ట్‌ మూవీ స్టార్‌ అయింది!

ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న విక్టరీ వెంకటేష్‌ తాజాగా తన 77వ చిత్రాన్ని త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో చేస్తున్నారు. గతంలో వెంకటేష్‌ సూపర్‌హిట్‌ సినిమాలు నువ్వు నాకు నచ్చావ్‌, మల్లీశ్వరి చిత్రాలకు రచయితగా పనిచేసిన త్రివిక్రమ్‌కి ఇంత కాలానికి వెంకటేష్‌తో సినిమా చేసే అవకాశం వచ్చింది. సాత్రంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ‘వెంకీ77’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ప్రారంభమైన ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బేనర్‌పై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

వెంకీ సినిమాలకు రైటర్‌గా పనిచేసిన త్రివిక్రమ్‌ ఎంతో కాలంగా అతని కాంబినేషన్‌లో సినిమా చెయ్యాలని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి మీడియాలో కూడా బాగా ప్రచారం జరిగింది. అయితే వెంకీకి సరిపోయే కథతో ఇంతకాలం ఎదురుచూసిన త్రివిక్రమ్‌ ఒక అద్భుతమైన కథతో డైరెక్టర్‌గా వెంకీతో సూపర్‌హిట్‌ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్‌.