English | Telugu
Keedaa Cola Day 1 Collections: కీడా కోలా వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్
Updated : Nov 4, 2023
క్యాలండర్ లో ప్రత్యేకంగా ముద్రించకపోయినా కూడా సినిమా ప్రేమికులకి ప్రతి శుక్రవారం ఒక పండగ రోజే. ఈ శుక్రవారం కూడా కీడా కోలా అనే మూవీ రూపంలో సినీ ప్రేమికులకి పండగ వచ్చింది .దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ ల దగ్గర సందడి వాతావరణం నెలకొని ఉంది.మరి కీడా కోలా మూవీ మొదటి రోజు సాధించిన కలెక్షన్ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
తన తొలి చిత్రం పెళ్లి చూపులతో ప్రేక్షకుల్లో మంచి పేరుని సంపాదించుకున్న తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన కీడా కోలా మూవీ నిన్న వరల్డ్ వ్యాప్తంగా విడుదల అయ్యి 5.65
కోట్ల రూపాయిల గ్రాస్ ని సాధించడంతో పాటు నైజాం లో 90 లక్షలు,ఆంధ్రలో 50 లక్షలు, కర్ణాటక ,రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్ సీస్ ల్లో 1 .45 కోట్లు ఇలా మొత్తం 2 .85 కోట్లు షేర్ ని సాధించింది.
కీడా కోలా మూవీ అశేష ప్రేక్షకాదరణతో ముందుకు దూసుకుపోతుంది. నాయుడుగా నటించిన తరుణ్ భాస్కర్ ,అతని తమ్ముడుగా నటించిన జీవన్ కుమార్, బ్రహ్మానందం, చైతన్య రావు తదితరుల చక్కని నటనతో పాటు తరుణ్ భాస్కర్ దర్శకత్వ ప్రతిభ కూడా కూడా కీడా కోలా మూవీ ఘన విజయం సాధించడానికి కారణమయ్యింది .
