English | Telugu

హిందీ హీరోతో వంశీ పైడిపల్లి సినిమా.. ఆ అగ్ర హీరోనేనా!

మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)అంటేనే మాస్ కి బ్రాండ్ అంబాసిడర్. అలాంటి ఎన్టీఆర్ క్లాస్ యాక్షన్ ని కూడా ఒక రేంజ్ లో పెర్ఫార్మ్ చేయగలడని నిరూపించిన చిత్రం 'బృందావనం'(Brindavanam).లవర్ బాయ్ గాను మెప్పించాడు. అలాంటి ఈ చిత్రంతో దర్శకుడుగా సినీ రంగంలో తనకంటు ప్రత్యేక గుర్తింపు పొందాడు వంశీ పైడిపల్లి'(Vamsi paidipally).కథకి సంబంధించిన అన్ని వేరియేషన్స్ తో పాటు, అందుకు తగ్గట్టుగా నటీనటుల్ని వంశీ డీల్ చేసే విధానం ప్రతి ఒక్కర్ని కట్టిపడేస్తుంది.ప్రభాస్ తో మున్నా, రామ్ చరణ్, అల్లు అర్జున్ ల ఎవడు, నాగార్జున కార్తీల ఊపిరి, మహేష్ తో మహర్షి వంటి చిత్రాలని తెరకెక్కించి అగ్ర దర్శకుడిగా ఎదిగాడు. కథకి తగ్గ టేకింగ్ తో ప్రేక్షకులని మెస్మరైజ్ చెయ్యడంలో కూడా వంశీ కి తిరుగులేదు.

ఇక వంశీ తమిళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చి ఇళయదళపతి 'విజయ్' తో 'వారిసు'(varisu)తెరకెక్కించి తెలుగు దర్శకుల గౌరవాన్ని రెట్టింపు చేసాడు. 2023 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయాన్నే అందుకుంది. ఈ చిత్రం తర్వాత వంశీ నుంచి ఎలాంటి కొత్త చిత్రానికి సంబంధించిన ప్రకటన రాలేదు. రీసెంట్ గా వినిపిస్తున్న కథనాల ప్రకారం వంశీ ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగుపెడుతు, అగ్ర హీరో సల్మాన్ ఖాన్(Salman Khan)తో ఒక సినిమా చెయ్యబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు వంశీ పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడని సల్మాన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికార ప్రకటన రానుందని కూడా అంటున్నారు.

దీంతో ఇప్పుడు ఈ న్యూస్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. సల్మాన్ ప్రస్తుతం 'బాటిల్ ఆఫ్ గల్వాన్' అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే,వంశీ పైడిపల్లి చిత్రం కూడా స్టార్ట్ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సల్మాన్ మాత్రం గత కొంత కాలం నుంచి వరుస పరాజయాలతో సతమవుతున్నాడు. రీసెంట్ గా సికందర్ తో భారీ ప్లాప్ ని అందుకున్నాడు. ఈ క్రమంలో సల్మాన్, వంశీ ప్రాజెక్ట్ అధికారకంగా ఖాయమైతే కనుక సల్మాన్ ని వంశీ హిట్ ని అందిస్తాడేమో చూడాలి. ఈ చిత్రాన్ని దిల్ రాజు(Dil Raju) నిర్మించబోతున్నాడని టాక్.


సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.