English | Telugu

తిండి, నిద్ర మానేసి రాత్రంత అదే పని.. దాంతో ఆరోగ్యం నాశనం  

ఊర్వశి చెప్పిన సంచలన విషయాలు
ఏం చెప్పింది!
రాత్రంతా ఏం పని
తను ఎందుకు అలవాటు చేసుకుంది!


అందంతో పాటు అందానికి తగ్గ అభినయం కలగలిపిన వాళ్ళని ఇంద్రలోకంలో ఉండే రంభ, ఊర్వశి, మేనక తో పోలుస్తుంటారు. అలాంటి వాళ్ళల్లో ప్రముఖ నటి 'ఊర్వశి'(Urvashi)కూడా ఒకరు. అందుకే కవిత రేంజిని అనే తన పేరుని ఊర్వశి గా మార్చారేమో. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఊర్వశి తన సొంత భాష మళయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఇప్పటి వరకు సుమారు 350 కి పైగా చిత్రాల్లో చేసింది. హీరోయిన్ గా అలరించిన చిత్రాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. నేటికి తన కట్ అవుట్ కి తగ్గట్టుగా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. రీసెంట్ గా ఊర్వశి ఒక ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో ఆమె చెప్పిన కొన్ని విషయాలు వైరల్ గా నిలిచాయి.


ఆమె మాట్లాడుతు 'మొదటి సారి పెళ్లి చేసుకొని అత్తగారింట్లో అడుగుపెట్టినప్పుడు వాతారవరణం చాలా కొత్తగా అనిపించింది.ఇంట్లో అందరూ కలిసి తాగడం, తినడం చేసే వారు. దాంతో ఎంత వద్దని అనుకున్నా, ఆ అలవాట్లు నాకు వచ్చాయి. షూటింగ్ నుంచి రాగానే ఆల్కహాల్ తాగడం అలవాటైపోయింది. క్రమంగా అది ఒక వ్యసనంగా మారిపోయింది. అప్పటికే ఇంటి బాధ్యత భుజాన పడటంతో ఇష్టం లేని పనులు కూడా చేశాను. నా అభిప్రాయాలూ ఇంట్లో ఎవరకి నచ్చక పోవడంతో కోపంతో మరింత ఎక్కువగా తాగే దాన్ని. తిండి, నిద్ర మానేసి తాగడంతో ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నాను. ఆ తర్వాత నా స్నేహితులు, పర్సనల్ స్టాఫ్ వల్ల ఆ వ్యసనం నుంచి బయటపడగలిగానని ఊర్వశి చెప్పుకొచ్చింది.


also read: మహేష్ కి తండ్రిగా లెజండ్రీ యాక్టర్ ! రాముడు కదా ఫ్యాన్స్ ఏమంటారో మరి

ఊర్వశి వ్యక్తి గత విషయానికి వస్తే 2000 వ సంవత్సరంలో ప్రముఖ మలయాళ నటుడు 'మనోజ్ కె జయన్'(Manoj K jayan)ని పెళ్లి చేసుకొని,2008 లో విడాకులు తీసుకుంది. జయన్ 1988 లో సినీ రంగ ప్రవేశం చేసి స్టార్ యాక్టర్ గా గుర్తింపు పొందాడు. సుమారు వంద చిత్రాలు తన ఖాతాలో ఉండగా నేటికీ ఎన్నో భారీ చిత్రాల్లో చేస్తు తన సత్తా చాటుతున్నాడు. తెలుగులో కూడా వీడే, శౌర్యం వంటి చిత్రాల్లో కనిపించాడు. ఊర్వశి, జయన్ కి ఒక కూతురు ఉంది. అనంతరం 2013 లో శివ ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా ఆ ఇద్దరికి ఒక కొడుకు ఉన్నాడు. శివ ప్రసాద్ చెన్నై కి చెందిన బిజినెస్ మెన్.


సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.