English | Telugu

నన్నెందుకు టార్గెట్‌ చేస్తున్నారు.. ప్రియదర్శి ఆవేదన.. అసలేం జరిగింది?

సోషల్‌ మీడియా అనేది కొందరికి వరంగా మారితే.. మరికొందరికి శాపంలా తయారైంది. ముఖ్యంగా కొందరు సెలబ్రిటీలకు తలనొప్పిగా మారింది. పొరపాటుగా ఏ చిన్న కామెంట్‌ చేసినా నెటిజన్లు వదిలిపెట్టడం లేదు. ట్రోలింగ్‌తో ఆ సెలబ్రిటీని ఏకి పారేస్తున్నారు. అలాంటి ట్రోలింగ్‌కి గురవుతున్నాడు యంగ్‌ హీరో ప్రియదర్శి. అయితే ఏమాత్రం సంబంధం లేకపోయినా తనను టార్గెట్‌ చేస్తున్నారని, నెగెటివ్‌ కామెంట్స్‌ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రియదర్శి నటించిన ‘మిత్రమండలి’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ప్రియదర్శి నుంచి మరో మంచి సినిమా రాబోతోందని అందరూ కామెంట్‌ చేశారు.

అదే సమయంలో ప్రియదర్శిని టార్గెట్‌ చేస్తూ చాలా నెగెటివ్‌ కామెంట్స్‌ వచ్చాయి. అలాంటి 300 కామెంట్స్‌ రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీని గురించి అడిగినపుడు ప్రియదర్శి ఏమన్నాడంటే.. ‘నామీద నెగెటివ్‌ కామెంట్స్‌ రావడం నాక్కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు. ఒకేసారి 300 కామెంట్స్‌ రావడంతో నిజంగానే నేను షాక్‌ అయ్యాను. ఆ కామెంట్స్‌ కూడా ఒకే ఐపి అడ్రస్‌ నుంచి రావడం మరింత ఆశ్చర్యంగా అనిపించింది. ఇది ఎవరు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ కామెంట్స్‌ గురించి తెలిసినపుడు ఎలా స్పందించాలి అనేది కూడా నాకు తెలియలేదు. అయితే ఇప్పటికే ఈ కామెంట్స్‌ గురించి సైబర్‌ క్రైంలో కంప్లయింట్‌ చేశాను. నేనేదైనా తప్పు చేస్తే నన్ను విమర్శించండి. అంతేకానీ, ఇలా కావాలని టార్గెట్‌ చేసి కామెంట్స్‌ పెట్టించడం మాత్రం చాలా తప్పు. ఇలా వాళ్లు ఎందుకు చేస్తున్నారో త్వరలోనే తెలుస్తుంది’ అన్నారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.