English | Telugu

పూజా హెగ్దేకి లగ్జరీ కారుని గిఫ్ట్‌గా ఇచ్చిన త్రివిక్రమ్!

వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’తర్వాత నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎంబి 28’ (వర్కింగ్ టైటిల్). త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మాణంలో ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం మహేష్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇటీవలే సెకండ్ షెడ్యూల్ షూటింగ్ మొదలై శరవేగంగా జరుగుపుకుంటోంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రినివాస్ ల కాంబినేషన్ లో ఇది మూడవ సినిమాగా తెరకెక్కుతోంది. గతంలో వీరి కాంబో లో వచ్చిన ’అతడు, ఖలేజా’ లు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమాలో మహేష్‌కి జోడీగా పూజ హెగ్డే నటిస్తుండగా శ్రీలీల ఓ కీలక పాత్ర పోషిస్తోంది. కాగా ఇటీవల త్రివిక్రమ్ పూజ హెగ్డే కి దాదాపు 2 కోట్ల విలైవన కారును గిఫ్ట్‌గా ఇచ్చాడని టాక్. అసలు విషయం ఏమిటంటే.... శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న SSMB 28 సెట్‌లోకి పూజా హెగ్దే అడుగు పెట్టబోతుంది. ఈ షూటింగ్‌కి పూజ వచ్చినన్ని రోజులు ఆమె కోసం ఒక కారును అరేంజ్ చేయాలి. ఇది ఖర్చుతో కూడిన విషయం. సో... అదే ఒక కారు ఆమెకు గిఫ్ట్‌గా కొనిస్తే సరిపోతుంది కదా.. పూజాకి కూడా మనము ప్రాధాన్యత ఇచ్చినట్లు వుంటుందని చిత్రం యూనిట్‌కి త్రివిక్రమ్ చెప్పడంతో వెంటనే పూజాకి కారును గిఫ్ట్‌గా ఇచ్చారంట. అన్నట్లు గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో‘ చిత్రాల తర్వాత ముచ్చటగా మూడోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తోంది పూజ.