English | Telugu
ప్రాజెక్ట్ కె నుంచి మిక్కీజేమేయర్ వాకౌట్!
Updated : Feb 25, 2023
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ప్రాజెక్ట్ కె. ప్రభాస్ హీరోగా నటిస్తుండగా దీపికాపడుకొనే హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశాపటాని కీలకపాత్రలను పోషిస్తున్నారు. కాగా ఈ ప్రాజెక్ట్ నుంచి సంగీత దర్శకుడు మిక్కీ జెమేయర్ బయటకు వచ్చేశారు. వైజయంతీ మూవీస్ బేనర్‌లో ఇప్పటివరకు నిర్మితమైన చిత్రాలకు భిన్నంగా ఈ మూవీ ఏకంగా 500కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది.
కాగా సంగీత దర్శకుడు మిక్కీజేమేయర్ సినిమా నుంచి బయటకు వచ్చేసిన విషయం గురించి నిర్మాత సి. అశ్వనీదత్ స్పందిస్తూ మిక్కీజెమేయర్ అందించిన సంగీతం ఎందుకో ఈ చిత్రం థీమ్ మ్యూజిక్ కి సరిగా సూట్ కావడం లేదు. ఆయన అందిస్తున్న ట్యూన్స్ కూడా ఎందుకో అందరినీ ఆకట్టుకునేలా లేవు. అందుకే అతనిని తొలగించి ఈస్థానంలోబాలీవుడ్ సంగీత దర్శకుడు సంతోష్ నారాయన్ని తీసుకుంటున్నాం. ఆయనతో పాటు మరో లేడీ సంగీత దర్శకురాలిని కూడా ఎంచుకుంటున్నాం. దీంతో సిని అభిమానుల్లో కలకలం చెలరేగింది. మిక్కీజెమేయర్ మంచి సంగీతం అందిస్తాడనే పేరుంది.
ఇదే దర్శకునితో ఇదే బేనర్‌లో రూపొందిన మహానటి చిత్రానికి కూడా మిక్కీజెమేయరే అద్బుతమైన సంగీతం అందించారు. ఆయన అందించిన సంగీతం వల్లనే మహానటి మ్యూజికల్ వండర్‌గా ఆ చిత్రాన్నినిలిపింది. మిక్కీజేమేయర్ సంగీతంలో మెలోడీ ప్రదానపాత్ర పోషిస్తుంది. అలాంటి ఉత్తమ అభిరుచి ఉన్న మిక్కీ జెమేయర్‌ని తొలగించి బాలీవుడ్ సంగీత దర్శకులను పెట్టుకోవడం వల్ల సినిమా అవుట్‌పుట్లో తేడా వచ్చే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమా అవుట్ పుట్‌లో తేడా వస్తే అది సంగీతపరంగా మైనస్ అయ్యేఅవకాశం ఉంది. మొత్తానికి ప్రాజెక్ట్ కె విషయంలో మిక్కీజేమేయర్ నిష్క్రమణ తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.