English | Telugu

టాలీవుడ్‌ హీరోలంతా ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో తెలుసా?

సెప్టెంబర్‌లో మొదటి విజయాన్ని నమోదు చేసిన సినిమా ‘లిటిల్‌ హార్ట్స్‌’. ఆ తర్వాతి వారంలో మరో భారీ విజయాన్ని అందుకున్న సినిమా ‘మిరాయ్‌’. చివరి వారంలో వచ్చిన ‘ఓజీ’ బ్లాక్‌బస్టర్‌ సాధించి సెప్టెంబర్‌ నెలను విజయాలతో నింపేసింది. అదే పరంపరను డబ్బింగ్‌ సినిమా ‘కాంతార చాప్టర్‌1’ అక్టోబర్‌లోనూ కొనసాగిస్తోంది. చాలా కాలం తర్వాత వరస విజయాలతో టాలీవుడ్‌ కళకళలాడుతోంది. ఇదే ఊపులో కొత్త సినిమాలను థియేటర్లకు తరలించాలన్న ఉద్దేశంతో టాలీవుడ్‌ హీరోలు తమ షూటింగ్స్‌ స్పీడును పెంచారు. తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాలలోని వివిధ లొకేషన్లలో తమ తమ సినిమాల షూటింగ్స్‌తో హీరోలంతా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏ సినిమా షూటింగ్‌లో ఉన్నారు అనే విషయాల గురించి తెలుసుకుందాం.

రామ్‌ హీరోగా మహేష్‌బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ చిత్రం షూటింగ్‌ హలో నేటివ్‌ స్టూడియోలో జరుగుతోంది. అలాగే నాని, శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో చేస్తున్న ‘ప్యారడైజ్‌’ షూటింగ్‌ కూడా అక్కడే జరుగుతోంది. అంతే కాదు శర్వానంద్‌ హీరోగా సంపత్‌ నంది తెరకెక్కిస్తున్న ‘భోగి’ చిత్రం షూటింగ్‌ కోసం హలో నేటివ్‌ స్టూడియోలోనే భారీ సెట్‌ నిర్మాణం జరుగుతోంది. త్వరలోనే ఈ సెట్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది.

ప్రభాస్‌తో మారుతి చేస్తున్న ‘రాజాసాబ్‌’ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ యూరప్‌లో జరుగుతోంది. చిరంజీవి, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రం షూటింగ్‌ అన్నపూర్ణ సెవెన్‌ ఎకర్స్‌లో చేస్తున్నారు. పవన్‌కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబో మూవీ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ షూటింగ్‌ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. అయితే పవన్‌కళ్యాణ్‌ ఇప్పటికే తనకు సంబంధించిన షూటింగ్‌ పార్ట్‌ కంప్లీట్‌ చేశారు. ప్రస్తుతం బ్యాలెన్స్‌ ఉన్న సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. మహేష్‌, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సినిమా షూటింగ్‌ రామోజీ ఫిలింసిటీలో చేస్తున్నారు. అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ షూటింగ్‌ ముంబైలో జరుగుతోంది.

అఖిల్‌ అక్కినేని హీరోగా కిశోర్‌ తెరకెక్కిస్తున్న ‘లెనిన్‌’ షూటింగ్‌ భూత్‌ బంగ్లాలో జరుగుతోంది. నాగచైతన్య, కార్తీక్‌ దండు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్‌ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. విజయ్‌ సేతుపతి, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా షూటింగ్‌ కూడా అక్కడే చేస్తున్నారు. ప్రశాంత్‌ వర్మ నిర్మాణంలో పూజ కొల్లూరు దర్శకత్వంలో రూపొందుతున్న లేడీ ఓరియంటెడ్‌ మూవీ ‘మహాకాళి’ షూటింగ్‌ ముచ్చింతలలో జరుగుతోంది. ఇలా టాలీవుడ్‌లోని హీరోలంతా షూటింగులలో నిమగ్నమై ఉన్నారు. చాలా కాలం తర్వాత ఒకేసారి వివిధ ప్రాంతాల్లో షూటింగ్స్‌ జరుగుతుండడంతో రాబోయే కాలంలో మరిన్ని మంచి సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.