English | Telugu

ఐస్‌క్రీం పాప బాగా బీజీ..


సీతమ్మ వాకిట్లే సిరిమల్లె చెట్టు సినిమాలో విరిసీ విరియని మల్లె మొగ్గలాగా మెరిసిన తేజస్వి ఐస్‌క్రీం సినిమాలో తన అందాలతో మతిచెడగొట్టింది. ఐస్‌క్రీం సినిమా హిట్టా ఫట్టా చర్చ పక్కన పెడితే ఈ పాపకు ఆఫర్లు మాత్రం బాగా వచ్చి పడ్డాయి.

రామ్ 'పండుగ చేస్కో' సినిమాలో, మంచు విష్ణుతో రాం గోపాల్ వర్మ రూపొందిస్తున్న '12' అనే చిత్రంలో, అలాగే శర్వానంద్, నిత్యామీనన్ నటిస్తున్న 'ఏమిటో ఈ మాయ' చిత్రాల్లో తేజస్వి అవకాశాలు దక్కించుకుంది. అంతే కాదు టీవీ యాంకర్, ప్రొడ్యూసర్ ఓంకార్ దర్శకత్వంలో రానున్న మరో చిత్రంలో కూడా తేజస్వికి అవకాశాలు వచ్చాయట.
ఏమైనా ఈ ఐస్‌క్రీం గర్ల్ ఒక్క సినిమాతో బాగా పాపులరే కాదు బిజీగా కూడా మారింది.