English | Telugu
మాస్ రాజాతో మిల్క్ బ్యూటీ రొమాన్స్
Updated : Sep 24, 2013
"తడాఖా" చిత్రం తర్వాత తన కెరీర్ కు కాస్త బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్పీడ్ పెంచేసింది తమన్నా. ప్రస్తుతం రవితేజ హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా హన్సికను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా తమన్నాను కూడా తీసుకున్నారు. ఈ ముగ్గురి కాంబినేషన్ ఇదే మొదటిసారి అవడం విశేషం. అదే విధంగా మహేష్ హీరోగా నటించనున్న "ఆగడు" చిత్రానికి కూడా తమన్నాను ఎంపిక చేసుకున్నారు. మరి ఈ రెండు చిత్రాలు తమన్నాకు ఎలాంటి విజయాన్ని అందిస్తాయో త్వరలోనే తెలియనుంది.