English | Telugu

పవన్ పైరసీపై బండ్ల గణేష్ ఆవేదన

పవన్ కళ్యాణ్ నటించిన "అత్తారింటికి దారేది" చిత్రం విడుదల కాకముందే లీక్ చేసి, పైరసీ చేసారు. ఈ విషయంపై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ.... ఇది ఘోరమైన చర్య. అసలు ఇలాంటి స్వార్థపరులను కఠినంగా శిక్షించాలి. ఎన్నో కష్టాలు పడి, మా ఆస్తులన్నీ పెట్టి సినిమా తీస్తుంటే... ఈ విధంగా చేయడం చాలా ఘోరంగా భావిస్తున్నాను. ఇలా చేసినవారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. ఈ చిత్ర నిర్మాత ప్రసాద్ గారు నాకు మంచి ఆత్మీయులు, పవన్ గారు నన్ను నిర్మాతగా నిలబెట్టారు. వీరి చిత్రాన్ని పైరసి చేసారని తెలిసిన క్షణం నుంచి చాలా భాదగా ఉంది. వీరి సినిమా అనే కాదు... అసలు ఏ సినిమానైనా పైరసీ చేయడం నేరం. ఈ వార్త తెలిసిన క్షణం నుంచి మంచి నీళ్ళు కూడా తాగలేదు. అసలు నోట మాట కూడా రావట్లేదు" అని తన భాదను వ్యక్తం చేసారు.