English | Telugu
ఏడు రోజులే డేట్స్ ఇచ్చిందట
Updated : Dec 24, 2013
అవిక, రాజ్ తరుణ్ జంటగా నటించిన తాజా చిత్రం "ఉయ్యాలా జంపాలా". విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ... "ఇందులో హీరోయిన్ గా నటించిన అవికకు చాలా పాపులార్టీ ఉంది. నెలకు కేవలం ఏడు రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చిందని తెలిసి, ఇంత చిన్న సినిమాకు ఆమె అవసరమా అని అనుకున్నాను. కానీ తెరపై ఆమెను చూశాక, నిర్మాత రామ్మోహన్ ఎంపిక ఎంత కరెక్టో అర్థమైంది" అని అన్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు రామ్మోహన్, నాగార్జున, దర్శకుడు విరించి వర్మ, అవిక, రాజ్ తరుణ్ లు పాల్గొన్నారు.