English | Telugu

మూడే రోజులు... రికార్డ్స్ అన్ని పగిలిపోయాయి.

ఇటీవలే షారుక్ నటించిన "చెన్నై ఎక్స్ ప్రెస్" వంద కోట్ల వసూళ్లను ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో హృతిక్ "క్రిష్3" చిత్రం అధిగమిస్తుందని అందరు అనుకున్నారు. కానీ ఈ వందకోట్ల మార్కును దాటడానికి నాలుగు రోజులు పట్టింది. కానీ ప్రస్తుతం అమీర్ ఖాన్ నటించిన "ధూమ్3" అన్ని రికార్డులను బ్రేక్ చేసేసింది. విడుదలైన మూడు రోజుల్లోనే 100కోట్లు వసూలు చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమా వంద కోట్లు వసూలు చేయడమంటే మాములు మాట కాదు. కానీ అనుకొని విధంగా వసూళ్లు సాధించి, ధూమ్ ధూమ్ అంటూ రికార్డులను బ్రేక్ చేస్తుంది "ధూమ్3". మరి త్వరలోనే ఈ చిత్రాన్ని అధిగమించే మరో చిత్రం వస్తుందో లేదో చూడాలి.