English | Telugu
రాజశేఖర్ తో పట్టపగలు చేస్తున్న వర్మ
Updated : Dec 24, 2013
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నటుడు రాజశేఖర్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి "పట్టపగలు" అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఇటీవలే వర్మ చెప్పిన కథ విని, వెంటనే రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని తెలిసింది. హర్రర్ తరహాలో రూపుదిద్దుకోనుంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అదే విధంగా మంచు విష్ణు, మోహన్ బాబుల కలయికలో వర్మ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రానికి "ఒట్టు" అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఇది పూర్తిగా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రమిది. మరి ఈ రెండు చిత్రాలు వర్మకు ఎలాంటి విజయం అందిస్తుందో చూడాలి.