English | Telugu
కమెడియన్...హీరో.. విలన్
Updated : Dec 2, 2013
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన "మర్యాద రామన్న" చిత్రంతో హీరోగా మారిన నటుడు సునీల్ ఇపుడు విలన్ గా మారడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే విషయం గురించి సునీల్ ..రాజమౌళి దర్శకత్వం అంటే తనకు చెప్పలేనంత అభిమానం ఉందని, ఆయన సినిమాల్లోనే విలన్గా కూడా చేయాలని ఉందని చెప్పాడు. రాజమౌళి చిత్రంలో విలన్గా చేసే అవకాశం వచ్చిందంటే మాత్రం సంతోషంగా చేస్తాను. ఇతర సినిమాల్లోనైనా విలన్గా చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, కాకపోతే మంచి పాత్ర వస్తే తప్పక చేస్తానని సునీల్ తన మనసులోని మాట చెప్పేసాడు.