English | Telugu
మహేష్ ను అపుడే అమ్మేసారంట...!
Updated : Dec 2, 2013
మహేష్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన"1" చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నెల 19న పాటలను విడుదల చేసి, వచ్చే నెల 10న సినిమాను విడుదల చేయబోతున్నారు. ఒక్కసాంగ్ మినహా షూటింగ్ పూర్తయింది. అయితే ఈ సినిమా ఏపీ రైట్స్‌ని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ దాదాపు 55 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తుంది. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అదే విధంగా "దూకుడు" చిత్రం తర్వాత మహేష్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న "ఆగడు" చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.