English | Telugu
నాడు అందాలు పంచింది.. నేడు అడుక్కుంటుంది...!
Updated : Dec 2, 2013
"డర్టీ పిక్చర్" తో యువత అందరికి తన అందచందాలతో మతిపోగొట్టిన విద్యాబాలన్ ను ఎవరైనా మర్చిపోతారా? ఈ సినిమాలో ఈ అమ్మడు చేసిన నటన కంటే ఆమె ఇచ్చిన హాట్ లుక్స్ కే కుర్రాళ్ళు పిచ్చోల్లై, విద్యా అందం ముందు బానిసలు అయిపోయారు. కానీ విద్యాబాలన్ తనపై ఉన్న ఈ హాట్ ఇమేజ్ ను కాస్త తగ్గించి, నటన పరంగా మంచి మార్కులు కొట్టెయ్యడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. "డర్టీ పిక్చర్" తర్వాత విద్యా "కహానీ" చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో విద్యా నటనకు అనేక అవార్డులను తెచ్చిపెట్టింది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు "బాబీ జసూస్" అనే సినిమాలో నటిస్తుంది. ఇందులో విద్యా ఎలా ఉండబోతుందో తెలుసా..? అప్పటి నుండి మీకు క్రింద ఒక ఫోటో కనిపిస్తుంది కదా.. ఆ ఫోటోలో ఉన్నది ఎవరనుకున్నారు? ఒకప్పుడు తన అందాలతో అదరగొట్టిన విద్యాబాలన్... ఇపుడు ఇలా కొత్త అవతారంలో కనిపిస్తుంది. మరి విద్యా ఇలా ఎందుకు మారిందో అనే విషయం.. ఈ సినిమా విడుదలయ్యేవరకు తెలియదు.