English | Telugu
గుర్రం కోసం భామగా మారిన హీరో
Updated : Dec 26, 2013
సినిమా అన్న తర్వాత అన్ని రకాల పాత్రలు చెయ్యాల్సిందే. ఈ మధ్య కాలంలో హీరోలందరూ కూడా ఆడవారి వేషంలో కూడా కనిపించి వారి నటన ప్రతిభ చాటుకుంటున్నారు. అయితే తాజాగా అదే కోవలోకి సుమంత్ కూడా చేరిపోయాడు. సుమంత్ హీరోగా నటించిన తాజా చిత్రం "ఏమో గుర్రం ఎగరావచ్చు". ఇటీవలే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. అయితే ఈ చిత్రంలో సుమంత్ గెటప్ అదిరిపోయింది. ఈ ఫోటోలో ఉన్న అమ్మడితో అదరగొట్టబోతున్నాడు. ఇంతకి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో అని అనుకుంటున్నారా? ఈ ఫోటోలో ఉన్నది హీరో సుమంత్. అసలు ఇంతకి సుమంత్ ఈ గెటప్ ఎందుకు వేసాడో అనేది త్వరలోనే తెలియనున్నది. సుమంత్ సరసన సావిక హీరోయిన్ గా నటిస్తుంది.