English | Telugu
ఆయనతోనే ఉత్తేజ్ కూతురి ఎంట్రీ...?
Updated : Dec 26, 2013
నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు ఉత్తేజ్. అయితే తన కూతురు చేతన త్వరలోనే నటిగా సినీరంగ ప్రవేశం చేయనుందని తెలిసింది. ఉత్తేజ్ కు అంత పెద్ద కూతురు ఉందంటే నమ్మట్లేదు కదా! కానీ ఇది నిజమే. ఉత్తేజ్ కూతురు చేతన త్వరలోనే నటిగా పరిచయం కాబోతుంది. ఇప్పటికే తన నటనతోనే కాకుండా పలు సినిమాలకు మాటలు, కథలు రాసి, మంచి పేరు తెచ్చుకున్నాడు ఉత్తేజ్. కానీ తన తండ్రి సపోర్ట్ లేకుండా ఈ సినిమా రంగంలో సొంతంగా ఎదగాలని చేతన ప్రయత్నాలు చేస్తుందట. మరి త్వరలోనే ఈ అమ్మడు హీరోయిన్ గా ఎదో ఒక సినిమాలో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది. కానీ ఈ విషయం తెలిసిన ఉత్తేజ్ సన్నిహితులు మాత్రం... ఉత్తేజ్ తన కూతురుని దర్శకుడు కృష్ణవంశీ సినిమా ద్వారానే హీరోయిన్ గా పరిచయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. మరి దీనిపై ఈ తండ్రికూతుళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి.