English | Telugu

కాంచి దర్శకత్వంలో సుమంత్...!

ఈ మధ్య సినీకథారచయితలు అందరు కూడా దర్శకత్వం చేయడానికి సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం అదే జాబితాలోకి ప్రముఖ కథా రచయిత ఎస్.ఎస్.కాంచి చేరారు.కాంచి కథ అందించిన "మర్యాద రామన్న" చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఆయన కథ అందించిన "ఏమో గుర్రం ఎగరావచ్చు" చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో సుమంత్ హీరోగా నటించాడు. త్వరలోనే సుమంత్ హీరోగా కాంచి ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఇటీవలే కాంచి చెప్పిన కథ సుమంత్ కు బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళ్ళనుందో త్వరలోనే తెలియనుంది.