English | Telugu

జిల్లాపై కన్నేసిన ఎన్టీఆర్

విజయ్, మోహన్ లాల్ ముఖ్య పాత్రలో నటించిన తమిళ చిత్రం "జిల్లా" ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్ర రీమేక్ కోసం ఇప్పటికే చాలా మంది దర్శక,నిర్మాతలు అడుగుతున్నారని ఈ చిత్ర దర్శకుడు నీసన్ పేర్కొన్నాడు. ఇప్పటికే ఈ చిత్ర తెలుగు రీమేక్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనతో మాట్లాడినట్లుగా నీసన్ అన్నారు. తాజాగా తను కూడా త్వరలోనే ఒక తెలుగు స్టార్ హీరోతో ఓ సినిమా చేయబోతున్నట్లుగా నీసన్ ప్రకటించాడు. ఆ స్టార్ హీరో ఎన్టీఆర్ అంటూ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం "రభస" చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. తర్వాత సుకుమార్ చిత్రంలో నటించనున్నాడు.