English | Telugu
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం పదవిపై సుమన్ కీలక వ్యాఖ్యలు
Updated : Nov 24, 2025
సుమన్(Suman).. ఈ పేరుకి తెలుగు సినిమా ప్రేక్షకులకి మధ్య ఉన్న అనుబంధానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అందుకే సుమన్ సినీ జీవితం గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా చాలా ఉందనే విషయాన్నీ ప్రేక్షకులే గుర్తు చేస్తారు. అంతలా సుమన్ కి ప్రేక్షకులకి మధ్య అనుబంధం ఉంది. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నా తమ గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తున్నారు. రీసెంట్ గా సుమన్ ఒక ఇంటర్వ్యూ లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan)పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు.
సుమన్ మాట్లాడుతు మన లైఫ్ లో ఎదుటి వ్యక్తిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. అందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష ఉదాహరణ. చాలా మంది పవన్ ని తక్కువ అంచనా వెయ్యడంతో పాటు ఫస్ట్ టైమ్ ఎన్నికల్లో నిలబడినప్పుడు ఎగతాళి చేశారు. దురదృష్టవశాత్తూ రెండు చోట్లా ఓడిపోయారు. కానీ రాజకీయాలని వదలకుండా గ్రౌండ్ లెవల్‌కి వెళ్లి కష్టపడ్డాడు. పవన్ కి ప్రధాన బలం అభిమానులు. కష్టాల్లోను ఆ అభిమానులు పవన్ ని వదిలిపెట్టలేదు. నన్ను ఒక్కసారి అసెంబ్లీకి పంపండి అని జనాల్లోకి వెళ్లారు. అందుకే ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు.
చంద్రబాబు గారు జైలుకి వెళ్ళినప్పుడు పవన్ జైలుకి వెళ్లి పరామర్శించి పొత్తు ప్రకటించడం కూడా కలిసొచ్చింది. తాను ఆంధ్రప్రదేశ్‌కి డిప్యూటీ సీఎం అవుతానని పవన్ అసలు ఊహించి ఉండరు. ఇప్పుడు ఆయన టైమ్ నడుస్తుంది. అందుకే నేను మొదట నుంచి టైంని నమ్ముతాను. ఏ టైం అయితే పవన్ ని ఓడగొట్టిందో, అదే టైం డిప్యూటీ సిఏం గా కూర్చోబెట్టింది.
Also read: అదొక సామ్రాజ్యం.. స్వయంభు రిలీజ్ డేట్ పై కీలక అప్డేట్ ఇచ్చిన నిఖిల్
ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఏపీ ప్రభుత్వంలో నంబర్ టూ స్థాయికి పవన్ వెళ్లడం నిజంగా అద్బుతం. చంద్రబాబు(Chandrababu Naidu)ఎక్స్‌పీరియన్స్ పవన్ కి బాగా ఉపయోగపడుతోంది. పవన్ క్రౌడ్ పుల్లర్, చంద్రబాబు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్. వీరిద్దరి కలయిక వల్ల ఏపిలో పరిపాలన గత ప్రభుత్వ పరిపాలన కంటే పర్లేదు. రియల్ ఎస్టేట్ కూడా ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందని కూడా సుమన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.