English | Telugu
గురువుపై అభిమానం చాటుకున్న సుధ కొంగర
Updated : Nov 12, 2020
దర్శకురాలు సుధ కొంగర పూర్వాశ్రమంలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం శిష్యురాలు అన్న సంగతి తెలిసిందే. సుధ సినిమాలను పరిశీలిస్తే.. తన గురువు ప్రభావం బాగానే కనిపిస్తుంటుంది కూడా. ఇక ఇప్పుడు ఓటీటీలో విడుదలైన 'ఆకాశం నీ హద్దురా' చిత్రంలోనూ మణిరత్నం శైలి.. అక్కడక్కడ కనిపించింది. అంతేకాదు.. ఒకట్రెండు చోట్ల తన గురుభక్తిని కూడా చాటుకున్నారు సుధ.
నాన్ - లీనియర్ స్క్రీన్ ప్లే తో సాగే ఈ సినిమాలో 90ల నాటి సన్నివేశాలు వచ్చినప్పుడు 'గీతాంజలి' మూవీ ఓ థియేటర్ లో ప్రదర్శితమవుతున్నట్లు చూపారు. ఇక 2000లలో జరిగే సన్నివేశాలు వచ్చినప్పుడు 'సఖి' సినిమా పోస్టర్స్ గోడలపై దర్శనమిచ్చాయి. మొత్తమ్మీద.. మణిరత్నం అందించిన క్లాసిక్స్ ని తన డ్రీమ్ ప్రాజెక్ట్ లో ప్రొజెక్ట్ చేసి మరీ అభిమానం చాటుకున్నారు ఈ ప్రతిభాశాలి. అలాగే.. ఓటీటీలో తొలి బ్లాక్‌బస్టర్ ని అందించిన డైరెక్టర్ గానూ పేరు తెచ్చుకున్నారు సుధ.