English | Telugu

దీపావళికి ఆల్కహాల్ శానిటైజర్లు వద్దంటున్న మెగా అల్లుడు

కరోనా కాలమిది. అందుకని, చాలామంది చేతికి శానిటైజర్లు రాసుకుంటున్నారు. ముఖానికి మాస్కులు ధరిస్తున్నారు. పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ ఒక మంచి సూచన చేశారు. దీపావళికి ఆల్కహాల్ శానిటైజర్లు ఉపయోగించవద్దని ఆయన చెప్పారు.

"ముందు జాగ్రత్త! దీపావళి వస్తోంది. అందరూ తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే... దీపాలు గానీ, టపాసులు గానీ కాల్చేటప్పుడు దయచేసి ఆల్కహాల్ శానిటైజర్లు ఉపయోగించవద్దు. ఎదుకంటే? దూరంగా ఉన్నా సరే వెంటనే చేతికి మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. అందువల్ల, మీ పట్ల, మీ పిల్లల పట్ల మీరు స్పెషల్ కేర్ తీసుకోవాలి" అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కళ్యాణ్ దేవ్ పేర్కొన్నారు. నిజమే... ఆల్కహాల్ శాతం ఎక్కువ ఉన్న శానిటైజర్ రాసుకోవడం వలన చేతికి మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. సో, కళ్యాణ్ దేవ్ చెప్పిన మాట విని, సూచన ఫాలో అయితే మంచిదే కదా!