English | Telugu

విజయ్ కి పోటీగా శివకార్తికేయన్!.

విజయ్ కి పోటీగా శివకార్తికేయన్!.

తమిళ అగ్ర హీరో ఇళయదళపతి 'విజయ్'(VIjay)ప్రస్తుతం 'జననాయగన్'(Jananayagan)అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో 'జననాయకుడు' అనే పేరుతో విడుదల కాబోతుంది. విజయ్ పొలిటికల్ పార్టీ స్థాపించిన తర్వాత వస్తున్న మూవీ కావడం,  టైటిల్ కూడా విజయ్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఉండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను సదరు మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. హెచ్ వినోద్(H. Vinod)దర్శకత్వంలో తెరకెక్కుతుండగా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల కాబోతుంది.

ఇదే డేట్ కి శివ కార్తికేయన్(Sivakarthikeyan)తో ప్రముఖ మహిళా దర్శకురాలు 'సుధా కొంగర'(Sudha Kongara)తెరకెక్కిస్తున్న 'పరాశక్తీ'(Para Shakthi)మూవీ రిలీజ్ కాబోతుందనే వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయంపై రీసెంట్ గా సుధా కొంగర ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు పరాశక్తి, జననాయగన్ చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదల కానున్నాయనే వార్తల గురించి నాకు తెలియదు. పరాశక్తి ఎప్పుడు విడుదల కావాలో నిర్మాతలే నిర్ణయిస్తారు. రిలీజ్ విషయంలో నా ప్రమేయం ఉండదని చెప్పుకొచ్చింది.

తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన సుధా కొంగర 'ఇరుది సుట్రు, సురారై పోట్రు' వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించింది. ఈ రెండు చిత్రాలు తెలుగులో గురు, ఆకాశమే నీ హద్దురా అని విడుదలయ్యాయి. ఇక శివ కార్తికేయన్ గత ఏడాది అక్టోబర్ లో 'అమరన్' తో వచ్చి తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకున్నాడు. దీంతో 'పరాశక్తి; పై భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీలీల హీరోయిన్ గా చేస్తుంది.

 

విజయ్ కి పోటీగా శివకార్తికేయన్!.