English | Telugu

‘గుంటూరు కారం’ విషయంలో ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం అదే!

ఇటీవలికాలంలో సోషల్‌ మీడియా విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమాలకు సంబంధించి రకరకాల అంశాలను వివిధ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వెలుగులోకి తెస్తున్నారు. దానివల్ల ఒక్కోసారి హీరో, హీరోయిన్లతోపాటు దర్శకనిర్మాతలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయాన్ని ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రస్తావించారు. విజయ్‌ దేవరకొండ హీరోగా తను నిర్మిస్తున్న ‘కింగ్‌డమ్‌’ చిత్రం జూలై 31న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ సోషల్‌ మీడియా వల్ల తను గతంలో ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడారు సూర్యదేరవ నాగవంశీ.

ఆ క్రమంలోనే మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో నాగవంశీ నిర్మించిన ‘గుంటూరు కారం’ చిత్రానికి వచ్చిన ట్రోలింగ్‌పై తన బాధను వ్యక్తం చేశారు. ‘సినిమా ఇండస్ట్రీలో శుక్రవారం అనేది చాలా ముఖ్యమైంది. సినిమా పుట్టిన నాటి నుంచి ఇప్పటివరకు శుక్రవారమే ఎక్కువగా సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. ఆ ఒక్కరోజే సినిమా వారి భవిష్యత్తు ఏమిటి అనేది తెలిసిపోతుంది. ఆరోజు మన సినిమా రిలీజ్‌ అయినా, వేరే వాళ్ళ సినిమా రిలీజ్‌ అయినా దాని నుంచి మనం కూడా ఎంతో కొంత నేర్చుకుంటాం. ఒక విధంగా శుక్రవారం అనేది ఇండస్ట్రీకి సర్‌ప్రైజ్‌ ఇచ్చే రోజు. నా కెరీర్‌లో రెండు సార్లు సర్‌ప్రైజ్‌ అయ్యాను. ఈమధ్యకాలంలో నన్ను సర్‌ప్రైజ్‌ చేసిన సినిమా లక్కీ భాస్కర్‌. ఎందుకంటే నేను ఎక్స్‌పెక్ట్‌ చేసినంత రెవిన్యూ అది చేయలేకపోయింది.

అలాగే గుంటూరు కారం కూడా నన్ను మరో విధంగా సర్‌ప్రైజ్‌ చేసింది. విడుదలైన మొదటిరోజు, రెండో రోజు సినిమాపై విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది. అలా మా సినిమాను ఎందుకు ట్రోల్‌ చేశారు అనే విషయం ఇప్పటికీ నాకు అర్థం కావడంలేదు. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ అయినప్పుడు ఎలాంటి ట్రోలింగ్‌ జరగలేదు. సినిమా బాగాలేదు అనే టాక్‌ ఎక్కడా వినిపించలేదు. ట్రోల్‌ చేసేంత విషయం సినిమాలో ఏం ఉందో తెలియలేదు. ఈ రెండు సంవత్సరాల్లో గుంటూరు కారం, లక్కీ భాస్కర్‌ చిత్రాలు నన్ను సర్‌ప్రైజ్‌ చేశాయి’ అంటూ తనను సర్‌ప్రైజ్‌ చేసిన రెండు సినిమాల గురించి చెప్పుకొచ్చారు నిర్మాత నాగవంశీ.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.