English | Telugu

కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు.. త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు!

Publish Date:Dec 10, 2025

గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ చిత్రం ‘అఖండ2 తాండవం’. డిసెంబర్‌ 12న థియేటర్లలో తన నటవిశ్వరూపాన్ని చూపించేందుకు సిద్దమయ్యారు నందమూరి బాలకృష్ణ. డిసెంబర్‌ 11న ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్‌ పడనున్నాయి.  డిసెంబర్‌ 11 రాత్రి 9 గంటలకు ప్రీమియర్స్‌ ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలాగే టికెట్ల ధరలను ఏమేరకు పెంచుకోవచ్చు అనే విషయాలను కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే ‘అఖండ2’ చిత్రానికి సంబంధించిన రిలీజ్‌ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. సినిమాలో బాలయ్య నట విశ్వరూపం ఎలా ఉంటుంది అనే విషయాన్ని టీజర్‌లో బలంగా చూపించారు. ‘కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు.. త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు.. ఎవడ్రా విభూది కొండను ఆపేది..’ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే డైలాగ్‌.. అఘోరా క్యారెక్టర్‌ను ఎలివేట్‌ చేస్తోంది. దాన్ని బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మరింత హైలైట్‌ చేసింది.  గదతో, త్రిశూలంతో దుష్ట శక్తుల్ని అంతమొందించే కీలక సన్నివేశాలను ఎంతో పవర్‌ఫుల్‌గా చిత్రీకరించారు. ఇలాంటి సీన్స్‌ ప్రేక్షకుల చేత తప్పకుండా విజిల్స్‌ వేయిస్తాయని టీజర్‌ చూస్తుంటేనే అర్థమవుతోంది. ‘అఖండ2’ చిత్రాన్ని చూసేందుకు, దైవానుభూతిని పొందేందుకు ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారికి రేపు థియేటర్లలో శివానుగ్రహం కలిగించే రీతిలో బోయపాటి శ్రీను ఆయా సీన్స్‌ను ఎంతో పవర్‌ఫుల్‌గా చిత్రీకరించారు. దీంతో ‘అఖండ2’ థియేటర్లలో ప్రేక్షకులు భక్తి పారవశ్యంలో మునిగిపోవడం ఖాయమని టీజర్‌ ప్రూవ్‌ చేస్తోంది. 

Akhanda 2 New Release Teaser Unleashes NBK's Massive Avatar

Publish Date:Dec 10, 2025

The anticipation for the pan-India film Akhanda 2, starring the God of Masses Nandamuri Balakrishna, has reached unprecedented levels. This highly-awaited project marks the fourth collaboration between NBK and director Boyapati Srinu, a legendary duo aiming for a remarkable fourth blockbuster following Simha, Legend, and Akhanda. Originally scheduled for December 5th, the movie's release was postponed, but it is now set to hit screens worldwide with premieres starting after 9 PM on December 11th, followed by a general release on December 12th. To celebrate the confirmed release date and amplify the excitement, the makers have launched a new release promo featuring never-before-seen shots of NBK. The teaser showcases the actor in an electrifying avatar, particularly in sequences where he is seen protecting Harshali Malhotra and dramatically channeling the Almighty spirits of Lord Shiva and Lord Hanuman while battling adversaries. Every frame serves to elevate NBK's persona to unimaginable heights, proving once again that Boyapati Srinu excels at bringing out the actor's best. NBK's magnetic screen presence is undeniable, and the teaser intensely increases the urge to witness the film on the big screen. Samyuktha, Aadi Pinisetty, Harshali Malhotra are playing other crucial roles.  Produced by 14 Reels Plus on a massive scale, the movie promises high production values, great technical standards, and brilliant visuals that spectacularly showcase the essence of Indian Sanatana Dharma. This action-packed promo strongly indicates that Akhanda 2 is poised to create a massive Mass Mayhem at the pan-India Box Office. Bookings for the film have already opened at full throttle across both Telugu states. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

సాయం చెయ్యడంలో తనకు తనే సాటి అని నిరూపించుకున్న మహానటి సావిత్రి!

Publish Date:Dec 5, 2025

(డిసెంబ‌ర్ 6 మ‌హాన‌టి సావిత్రి జ‌యంతి సంద‌ర్భంగా..) సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో మద్రాస్‌ చేరుకున్న సావిత్రి చిన్న చిన్న పాత్రలు వేస్తూ మహానటిగా ఎలా ఎదిగారో అందరికీ తెలిసిందే. ఆమె నటిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా అంతే పేరు తెచ్చుకున్నారు. కష్టాల్లో ఉన్న ఎంతో మందిని ఆదుకున్నారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు భారీ విరాళాలు అందించారు. అంతేకాదు, తోటి నటీనటులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా వారికి ఆర్థిక సాయం చేశారు.  అలాంటి మహౌన్నతమైన వ్యక్తిత్వం కలిగిన సావిత్రి చివరి దశలో ఎలాంటి కష్టాలు అనుభవించారు, ఆర్థికంగా ఎలాంటి ఒడిడుకులకు లోనయ్యారు అనేది మనకు తెలుసు. తను ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా ఇతరులకు సాయం చేయడానికి వెనుకాడే వారు కాదు. అప్పు చేసైనా తనకు చేతనైనంత సహాయం చేసేవారు. అలాంటి ఓ అరుదైన సంఘటన 1975లో జరిగింది.  నటిగా తను మంచి స్థాయిలో ఉన్నప్పుడు వడ్డీవారిపాలెం గ్రామంలో ఒక పాఠశాలను తన స్వంత ఖర్చులతో నిర్మించారు సావిత్రి. శ్రీమతి సావిత్రి గణేష్‌ పాఠశాల పేరుతో ఆ స్కూల్‌ను 1962లో స్థాపించారు. ఆ తర్వాత పాఠశాలను ప్రభుత్వం గుర్తించింది. అప్పటి నుంచి శ్రీమతి సావిత్రి గణేష్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలగా పేరు మారింది. పాఠశాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రాంట్‌ వచ్చేది. దానితోనే సిబ్బందికి జీతాలు ఇచ్చేవారు.  1975 ప్రాంతంలో పాఠశాల ఎలా ఉంది అనే విషయం తెలుసుకునేందుకు ఆ స్కూల్‌ కరస్పాండెంట్‌కు ఫోన్‌ చేశారు సావిత్రి. అతను చెప్పిన మాటలు విని ఆమె షాక్‌ అయ్యారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్‌ రాకపోవడం వల్ల 5 నెలల నుంచి ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడం లేదని ఆయన చెప్పారు. సావిత్రి మరో మాట మాట్లాడకుండా ఆ కరస్పాండెంట్‌ను మద్రాస్‌ రమ్మని చెప్పారు.  మద్రాస్‌ వెళ్లిన ఆ కరస్పాండెంట్‌కు 1 లక్షా 4 వేల రూపాయల చెక్కును అందించి ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించమని చెప్పారు. ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్‌ విషయం తర్వాత చూసుకుందామని చెప్పి ఆయన్ని పంపించారు. 1975లో లక్ష రూపాయలు అంటే ఇప్పటి లెక్క ప్రకారం 40 లక్షల రూపాయలకు పైనే ఉంటుంది.  ఈ డబ్బు చెల్లించే సమయానికి సావిత్రి ఆర్థికంగా బాగా చితికిపోయి ఉన్నారు. అయినప్పటికీ స్కూల్‌ సిబ్బంది కష్టాలు చూడలేక ఆమె ఆ డబ్బును ఏర్పాటు చేశారు. తను ఏ స్థితిలో ఉన్నాను అనేది కూడా ఆలోచించకుండా దానధర్మాలు చేయడానికి వెనుకాడని సావిత్రి వంటి మహాదాత సినీ పరిశ్రమలో మరొకరు లేరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

వి.శాంతారాం బయోపిక్‌ : చీరకట్టులో అందర్నీ కట్టిపడేస్తున్న తమన్నా!

Publish Date:Dec 10, 2025

- 60 ఏళ్ల సుదీర్ఘమైన కెరీర్ - నిర్మాతగా 90 సినిమాలు, దర్శకుడిగా 55 సినిమాలు - భారతీయ సినిమాకు ఆద్యుడు   భారతీయ చిత్ర పరిశ్రమలో వి.శాంతారాం ఓ శకంగా పేర్కొనవచ్చు. ఎంతో మంది నటీనటులు, దర్శకనిర్మాతలు ఆయన్ని ఆద్యుడిగా భావిస్తారు. 60 సంవత్సరాలకుపైగా చిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సేవలందించిన శాంతారాం జీవితం ఎందరికో ఆదర్శం. తన కెరీర్‌లో 90 సినిమాలు నిర్మించి, 55 సినిమాలకు దర్శకత్వం వహించిన లెజెండ్‌ శాంతారాం. రaనక్‌ రaనక్‌ పాయల్‌ బాజే, దో ఆంఖే బారా హాత్‌ వంటి కళాఖండాలను ఆయన రూపొందించారు. చిత్ర పరిశ్రమకు ఆయన సేవలకుగాను పద్మవిభూషణ్‌, దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాలతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. ఇవి కాక ఆయన అందుకున్న పురస్కారాలు, సత్కారాలకు లెక్క లేదు.   Also Read: ఆదర్శ కుటుంబం హౌస్ నెం 47 ఈ రోజే.. అభిమానుల్లో జోష్     భారతీయ చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేసిన శాంతారాం జీవితంగా ఆధారంగా ‘వి.శాంతారాం’(ది రెబల్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా) పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. అభిజీత్‌ శిరీష్‌ దేశ్‌పాండే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శాంతారాం పాత్రను సిద్ధాంత్‌ చతుర్వేది పోషిస్తున్నారు. శాంతారాంకు ముగ్గురు భార్యలు. విమలాబాయి, జయశ్రీ, సంధ్య. జయశ్రీ నటి కూడా. సినిమాలో ఎంతో కీలకంగా ఉండే జయశ్రీ పాత్రను తమన్నా పోషిస్తున్నారు. ఒక లెజండరీ డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ బయోపిక్‌లో తమన్నాకి అవకాశం దక్కడం నిజంగా ఆమె అదృష్టం అంటున్నారు.    Also Read: అఖండ 2 ఎఫెక్ట్.. రిలీజ్ వాయిదా పడిన కొత్త చిత్రాలు    తాజాగా శాంతారాం బయోపిక్‌కి సంబంధించి తమన్నా క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. సంప్రదాయ చీరకట్టులో, గౌరవప్రదంగా కనిపిస్తున్న తమన్నా లుక్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆమె కెరీర్‌లో ఇదొక ప్రత్యేకమైన పాత్ర అని చెప్పాలి. ఇంతకుముందెన్నడూ ఇలాంటి క్యారెక్టర్‌ తమన్నా చెయ్యలేదు. సినిమా బ్యాక్‌గ్రౌండ్‌తోనే సాగే శాంతారాం బయోపిక్‌ను ఓ స్పెషల్‌ మూవీగా తెరకెక్కిస్తున్నారు అభిజీత్‌. తాజాగా విడుదలైన తమన్నా లుక్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Bigg Boss 9 Telugu Voting 14th week: ఓటింగ్‌లో తనూజ టాప్.. సుమన్ శెట్టికి ఆ భయం లేదు!

Publish Date:Dec 10, 2025

బిగ్ బాస్ సీజన్-9 లో పదమూడో వారం రీతూ చౌదరి ఎలిమినేషన్ అవ్వగా హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో కెప్టెన్ కళ్యాణ్ కాబట్టి అతను నామినేషన్లో లేడు. ఇక మిగిలిన ఆరుగురిలో ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారో.. ఎవరు టాప్ లో ఉన్నారో ఓసారి చూసేద్దాం. ప్రతీ వారంలో లాగే తనూజ ముప్పై శాతం ఓటింగ్ తో టాప్ లో ఉంది. సంజన గల్రానీ కి పదిహేను శాతం ఓటింగ్ పడుతోంది. డీమాన్ పవన్ 14.91 శాతంతో మూడో స్థానంలో ఉన్నాడు. భరణి 14.7 శాతం ఓటింగ్ తో నాల్గవ స్థానంలో ఉన్నాడు. 13.6 శాతం ఓటింగ్ తో ఇమ్మాన్యుయేల్ అయిదో స్థానంలో ఉన్నాడు. ఇక చివరగా 10.78 శాతం ఓటింగ్ తో సుమన్ శెట్టి లీస్ట్ లో ఉన్నాడు. అయితే సుమన్ శెట్టి లీస్ట్ లో ఉన్నా అతను ఎలిమినేషన్ కాడు.. ఎందుకంటే సుమన్ శెట్టి ప్రభంజనం అలాంటిది. గతవారం సుమన్ శెట్టి లీస్ట్ లో ఉండి.. తనపైన సంజన, రీతూ ఉండగా.. రీతూని ఎలిమినేషన్ చేసాడు బిగ్ బాస్. అంటే ఈ సారి కూడా సుమన్ శెట్టి ఎలిమినేట్ కాడు. దివ్య, రీతూ చౌదరి, నిఖిల్, దమ్ము శ్రీజ, గౌరవ్ .. వీళ్ళందరి కంటే సుమన్ శెట్టి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆ.. కాదు.. కానీ హౌస్ లో ఉంటాడు. ఎందుకంటే అదే సుమన్ శెట్టి ప్రభంజనం.  సంజన, సుమన్ శెట్టిలకి బిగ్ బాస్ బయాజ్డ్ ఉన్నాడని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. హౌస్ లో ఎవరెంత ఆడినా, ఆడకపోయినా రిస్క్ ఉంటుంది.. భయం ఉంటుంది.‌ కానీ సుమన్ శెట్టికి ఆ భయం లేదు. ఎందుకంటే పదమూడు వారాల్లో అతనేం చేయకపోయినా ఎలిమినేట్ అవ్వడం లేదు.. అసలేం చేశాడో.. ఎందుకు హౌస్ లో ఉంచుతున్నారో బిగ్ బాస్ మామకే తెలుసు. అయితే ఓటింగ్ ప్రకారం సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్ డేంజర్ జోన్ లో ఉన్నారు.

వారణాసిలో ఐదు పాత్రల్లో మహేష్.. ఏం ప్లాన్ చేశావయ్యా జక్కన్న!

Publish Date:Dec 9, 2025

  ఇంతవరకు డ్యూయల్ రోల్ చేయని మహేష్! ఇప్పుడు వారణాసిలో ఏకంగా ఐదు పాత్రల్లో సర్ ప్రైజ్!   హీరోగా రెండున్నర దశాబ్దాల సినీ కెరీర్ లో మహేష్ బాబు(Mahesh Babu) డ్యూయల్ రోల్ చేయలేదంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. 'నాని' సినిమాలో మాత్రమే కాసేపు డ్యూయల్ రోల్ లో కనిపించాడు. ఫుల్ లెంగ్త్ లో ఇంతవరకు నటించలేదు. అలాంటి మహేష్ బాబు.. ఇప్పుడు రెండు పాత్రల్లో కాదు, ఏకంగా ఐదు పాత్రల్లో అలరించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.   మహేష్ బాబు, రాజమౌళి(Rajamouli) కాంబినేషన్ లో 'వారణాసి'(Varanasi) అనే భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాని 2027 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.    'వారణాసి'లో మహేష్ రుద్ర అనే పాత్ర పోషిస్తున్నాడు. ఈ పాత్రకి సంబంధించిన లుక్ ఆకట్టుకుంది. అలాగే ఇందులో శ్రీరాముడిగా కూడా మహేష్ కనిపించనున్నాడు. ఈ రెండు పాత్రలతో పాటు.. మరో మూడు పాత్రలలో మహేష్ కనువిందు చేయనున్నాడట. అందులో ఒకటి శివుడి పాత్ర అని ప్రచారం జరుగుతోంది. మిగతా రెండు పాత్రలు కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటాయట. ఒక్కో పాత్రలో మహేష్ కనిపించే తీరు సర్ ప్రైజ్ చేయడం ఖాయం అంటున్నారు.   Also Read: ఆ హీరోయిన్ తో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ రెండో పెళ్లి..!   ఈ జనరేషన్ లో ట్రిపుల్ రోల్ చేయడమే అరుదు అయిపోయింది. అలాంటిది మహేష్ ఏకంగా ఐదు పాత్రలో కనిపించనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది. పైగా దర్శకుడు రాజమౌళి కాబట్టి.. ప్రతి పాత్రని ఎంత గొప్పగా చూపిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.    'వారణాసి'లో మహేష్ ఐదు పాత్రలు పోషిస్తున్నాడనే వార్త నిజమైతే మాత్రం.. ఇది అభిమానులకు బిగ్ ట్రీట్ అని చెప్పవచ్చు.  

Is Mahesh Babu playing five roles in Varanasi?

Publish Date:Dec 10, 2025

Superstar Mahesh Babu and legendary director SS Rajamouli are coming together for the first time with Vaaranaasi. The movie announcement video has created global sensation with stunning VFX and high-end concept. The movie team have been maintaining a tight lip about shooting updates, post the release of the video.  Now, the rumors about Mahesh Babu playing five roles are going around across the internet. It is stated that along with Lord Rama, Rudra, he is playing roles like Lord Shiva, A traveller King of Ancient India and another hidden role. They are also staring that the movie is being divided into two parts.  Rumors are also aplenty that Mahesh is taking Rs.50 crore salary per annum for the project till the movie shoot is over. He might be looking at a huge paycheck of Rs.150-175 crores as his remuneration for the film. Rajamouli is said to be planning even bigger schedule from January till March 2026, in RFC.  Well, some close sources to the team have rubbished five roles for Mahesh rumors. They stated that he might be appearing in different get-ups but only two roles as Rama and Rudra. And they did not confirm about MB's salary or two parts rumors. Priyanka Chopra and Prithviraj Sukumaran are playing other leading roles.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

ప్రేమంటే

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969

Andhra King Taluka

Publish Date:Dec 31, 1969

Raju Weds Rambai

Publish Date:Dec 31, 1969

12A Railway Colony

Publish Date:Dec 31, 1969

Premante

Publish Date:Dec 31, 1969