English | Telugu

SSMB29: బిగ్ అప్డేట్.. మహేష్ ఫ్యాన్స్ కాలరెగరేసే టైం వచ్చింది!

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 29వ సినిమాని దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. కె.ఎల్.నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ కి 'SSMB29' అనేది వర్కింగ్ టైటిల్. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అభిమానులను ఆనందపరుస్తూ తాజాగా బిగ్ అప్డేట్ వచ్చింది.

'SSMB29' ఫస్ట్ రివీల్ నవంబర్ లో ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. నవంబర్ 15 సాయంత్రం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ లో టైటిల్ ని రివీల్ చేయడంతో పాటు, ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేసే అవకాశముంది. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ ఈవెంట్ ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది.

Also Read:జ్యోతిలక్ష్మీ చివరి రోజులు ఎలా గడిచాయి?

సినిమాలకు భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లు జరగడం కామన్. ఇలా ఫస్ట్ రివీల్ కోసం ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేయడం ఇదే మొదటిసారని చెప్పవచ్చు.

మహేష్-రాజమౌళి సినిమాకి రకరకాల టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల 'వారణాసి' టైటిల్ ప్రముఖంగా వినిపించింది. మరి ఈ మూవీ టైటిల్ ఏంటనేది త్వరలోనే తేలిపోనుంది.