English | Telugu

బ్రహ్మితో కూడా సున్నం పెట్టుకుంటాడా...?

"వెంకీ", "డీ" చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు శ్రీనువైట్ల. అయితే "వెంకీ" చిత్రం నుండి మొన్న వచ్చిన "బాద్ షా" చిత్రం వరకు అన్ని చిత్రాలలో కమెడియన్ బ్రహ్మానందం కు ఒక సెపరేట్ కామెడి ట్రాక్ పెట్టి, సినిమా సక్సెస్ కు బ్రహ్మి కూడా ఒక కారణం అనిపించేలా చేశాడు శ్రీను. అయితే ఇటీవలే తన ఆస్థాన రచయితలుగా ఉన్న కోన వెంకట్, గోపీ మోహన్ లతో విడిపోయి సున్నం పెట్టుకున్నాడు. తాజాగా శ్రీనువైట్ల మరో పెద్ద నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్ హీరోగా నటించబోయే "ఆగడు" చిత్రంలో బ్రహ్మానందం ను తీసుకోకుడదని అనుకుంటున్నాడట. ఈ విధంగా అటు రచయితలను, బ్రహ్మానందం ను తీసేసి "ఆగడు" చిత్రాన్ని హిట్ చేసి తన సత్తా ఏంటో చూపించాలని శ్రీను అనుకుంటున్నాడట. మరి శ్రీను ఆశలు ఫలిస్తాయో లేదో త్వరలోనే తెలియనుంది.