English | Telugu

డిసెంబర్ లో ఎవడు వచ్చేస్తున్నాడు

రామ్‌చరణ్ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసే మెగా అభిమానులకు శుభవార్త.నటించిన "ఎవడు" సినిమా ఎట్టకేలకు ముహూర్తం ఫిక్సయింది. డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు దిల్‌రాజు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుతోపాటు మలయాళ వెర్షన్ కూడా అదే‌రోజు రానుంది. ఈ చిత్రంలో అల్లు‌అర్జున్, కాజల్ ప్రత్యేక పాత్రలో నటించారు. చెర్రీ కెరీర్‌లో ఇది బెస్ట్‌‌ఫిల్మ్ అవుతుందని దిల్‌రాజు చెప్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో చెర్రీ సరసన శృతి‌హాసన్, ఎమీ జాక్సన్ హీరోయిన్లు గా నటించారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.